అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈసారి భారతీయ అమెరికన్లు ఎలాంటి పాత్రను పోషించారో ప్రత్యేకంగా చెప్కనక్కర్లేదు.దేశవ్యాప్తంగా రిపబ్లికన్, డెమొక్రాటిక్ పార్టీల నుంచి వారు పోటీ చేసి చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లను సంపాదించారు.
ఇక ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ఎన్నిక గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.అధ్యక్ష ఎన్నికలు ముగిసిన తర్వాత మరో కీలక ఎన్నికల్లో భారతీయ అమెరికన్లు తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు.
చికాగో ప్రాంతంలో జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో దాదాపు పది మంది భారతీయులు పోటీపడుతున్నారు.వీరిలో మాజీ కాంగ్రెస్ అభ్యర్ధి సహా ప్రముఖ వైద్యుడు కూడా వున్నారు.
ఇది అమెరికన్ రాజకీయాల్లో భాగం కావాలనే భారతీయ అమెరికన్ సమాజంలో పెరుగుతున్న అభిలాషను ప్రతిబింబిస్తుంది.వీరిలో ఐదుగురు మహిళలు కూడా వున్నారు.
ఏప్రిల్ 6న ఎన్నికలు జరగాల్సి వున్నప్పటికీ.ముందస్తు ఓటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది.
జితేంద్ర దిగాన్వ్కర్ అనే కమ్యూనిటీ నేత మైనే టౌన్‌షిప్ హైవే కమీషనర్ పదవి కోసం పోటీ పడుతున్నారు.చికాగో లూప్‌కు పశ్చిమాన 15 మైళ్ల దూరంలో వున్న ఓక్ బ్రూక్ నగరంలో ట్రస్టీ సీటు కోసం అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (ఏఏపీఐ) మాజీ అధ్యక్షుడు డాక్టర్ సురేశ్ రెడ్డి బరిలో నిలిచారు.
షామ్‌బర్గ్ టౌన్‌షిప్ ట్రస్టీగా నిమిష్ జానీ పోటీ పడుతుండగా, సయ్యద్ హుస్సేనీ.హనోవర్ పార్క్ టౌన్‌షిప్ ట్రస్టీగా, మైనే టౌన్‌షిప్ క్లర్క్‌గా స్మితేష్ షా పోటీపడుతున్నారు.కమలా హారీస్ స్పూర్తితో ఐదుగురు భారతీయ మహిళలు సైతం ఎన్నికల బరిలో నిలిచారు.నాపర్‌విల్లే సిటీ కౌన్సిల్‌కు వాసవి చక్కా, వీట్ ల్యాండ్ టౌన్‌షిప్ ట్రస్టీగా మెహగానా బన్సాల్, ఆల్డర్‌మాన్ 10వ వార్డ్‌కు డిస్ట్రిక్ట్ 204 స్కూల్ బోర్డ్ కోసం పోటీపడుతున్నారు.
దిగాన్వ్కర్ 1999లో డెస్ ప్లెయిన్స్, మైనే టౌన్‌షిప్‌కు వలస వచ్చి 2003లో యునైటెడ్ స్టేట్స్ పౌరసత్వం పొందారు.కొన్నేళ్ల క్రితం భారత అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలో నిలిచాడు.
వీట్‌ల్యాండ్ టౌన్‌షిప్ ట్రస్టీ పదవికి పోటీపడుతున్న మేఘనా బన్సాల్ ఫైనాన్స్‌లో ఎంబీఏ చేసి గ్లోబల్ ఆర్గనైజేషన్‌లో ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నారు.ఇండియన్ కమ్యూనిటీ ఔట్‌రిచ్ ఆర్గనైజేషన్‌లో మహిళా విభాగానికి నాయకత్వం వహిస్తున్నారు.
ఇండియా డే ఫెస్టివల్ సహా పలు విద్యా కార్యక్రమాలను నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

వాసవి చక్కా సీనియర్ ఐటీ మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్.నాపర్‌విల్లేలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ బోర్డులో ఫైనాన్స్ కమిటీ సభ్యురాలిగా పనిచేశారు.ఆమె ప్రస్తుతం బిజినెస్ వర్క్స్ కమిటీ సభ్యురాలిగా పనిచేస్తున్నారు.
ఇక స్థానిక భారతీయ అమెరికన్ సమాజంలో చురుకుగా వున్న జానీ.ఇండియన్ అమెరికన్ రిపబ్లికన్ ఆర్గనైజేషన్ ఛైర్‌పర్సన్‌గా వున్నారు.
ఫిజిక్స్, మేథమేటిక్స్‌లో డిగ్రీ పొందిన ఆయన జర్నలిజంలో డిప్లొమా చేశారు.