మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడటంతో ఈ సినిమా ఎలాంటి కంటెంట్‌తో తెరకెక్కుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ సినిమాలో చిరు సరికొత్త అవతారంలో కనిపిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.
ఇక ఈ సినిమా తరువాత చిరు తన నెక్ట్స్ మూవీని కూడా లైన్‌లో పెట్టేందుకు రెడీ అవుతున్నాడు.
మలయాళంలో సూపర్ హిట్ మూవీగా నిలిచిన లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న చిరు, ఈ సినిమాతో అదిరిపోయే హిట్ అందుకునేందుకు సిద్ధం అవుతున్నాడు.ఇక ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటుడు జగపతి బాబు నటించనున్నట్లు తెలుస్తోంది.
గతంలో ఫ్యామిలీ స్టార్ హీరోగా జగపతి బాబు తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు.ఆ తరువాత కెరీర్‌లో ఫేడవుట్ అవుతున్న సమయంలో లెజెండ్ సినిమాలో విలన్ పాత్రలో నటించి కమ్‌బ్యాక్ ఇచ్చాడు.
ఇప్పుడు లూసిఫర్ రీమేక్ చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించేందుకు చిత్ర యూనిట్ ఆయన్ను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది.ఏదేమైనా జగపతి బాబు లాంటి విలక్షణ నటుడు ఈ సినిమాలో నటిస్తున్నాడంటే సినిమాలో ఆయన పాత్రకు ఎలాంటి ప్రాముఖ్యత ఉంటుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
ఇక ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సుజీత్ డైరెక్ట్ చేస్తుండగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేయనున్నాడు.ఇప్పటికే స్క్రిప్టు పనులు ముగించుకున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా పట్టాలెక్కించేందుకు చిరు అండ్ టీమ్ రెడీ అవుతున్నారు.







