రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పరివార్ పేరు తెలియని వారు ఉండరు.1925లో చిన్న సంస్థగా ప్రారంభం అయి.ప్రపంచంలోనే పెద్ద సంస్థగా ఎదిగింది.ఢిల్లీ నుంచి గల్లీ స్థాయి వరకూ శాఖలను ఏర్పాటు చేస్తూ.
యువతను దేశ భక్తి వైపు లాగుతోంది.స్కూల్ స్థాయి నుంచే విద్యార్థుల్లో స్వధర్మ ఆచరణను పెంచుతోంది.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కు సుమారు 72 శాఖలు ఉన్నట్టు తెలుస్తోంది.ఆర్ఎస్ఎస్ కు స్టూడెంట్ వింగ్, రైతు వింగ్, యూత్ వింగ్, భజరంగ్ ధళ్, బీజేవైఎం లతో పాటే పొలిటికల్ వింగ్ కూడా ఉంది.
ఆర్ఎస్ఎస్ పొలిటికల్ వింగ్ అయిన బీజేపీ.తన మాతృసంస్థ వెన్నుదన్నుతోనే దేశంలో వేళ్లూనుకు పోయింది.
డాక్టర్ హెడ్గేవార్ ఆర్ఎస్ఎస్ ను స్థాపించిన దగ్గరి నుంచి తనదైన విధానాలతో దూసుకుపోతూ వచ్చింది.ఇక సర్ సంఘ చాలక్ గా.గోల్వార్కర్ వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ చాలా మార్పులను తీసుకువచ్చకుంది.

మహారాష్ట్రాలోని నాగ్ పూర్ వేదికగా దేశంలోని కనిపించని రాజ్యాంగం అమలు చేస్తోంది.ఎక్కడా కూడా అధికారికంగా సమావేశాలు, సభలు ఏర్పాటు చేయదు.హంగూ ఆర్భాటాల జోలికి అస్సలు పోదు.
కేవలం ఫుల్ టైమర్ల సాయంతో నడుస్తుంది.అంతే కాకుండా గురుపూజోత్సవం రోజున స్వయం సేవకులు ఇచ్చే విరాళాలతో నడుస్తుంది.
ఇలా ఆసేతు హిమాచలం దేశానికి కనిపించని ఆర్మీలాగా పనిచేస్తోందని బీజేపీ నేతలు చెబుతుంటారు.బీజేపీ తీసుకునే ప్రతీ నిర్ణయంలోనూ ఆర్ఎస్ఎస్ హస్తం ఉంటుందనేది కాదనలేని వాస్తవం.
ఇలా దేశంలో అధికారంలో ఉండే పార్టీని అనధికారంగా రూల్ చేస్తూ వస్తోన్న సంఘ్ పరివార్ ఒప్పుడు క్రమంగా కనుమరుగు అయ్యే పరిస్థితికి వచ్చిందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.

నాగ్ పూర్ వేదికగా, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ, అట్ నుంచి కటక్ వరకూ శాఖలను నడుపుతున్న.ఆర్ఎస్ఎస్.ఇప్పుడు స్వస్థలంలో కనుమరుగు అవుతోంది.
మహారాష్ట్రాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగ్ పూర్ లో బీజేపీ ఘోర పరాభవం చవి చూసింది.అంతే కాకుండా సంఘ్ పరివార్ నేతలు కూడా ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్నట్టు తెలుస్తోంది.
చెట్టు మొదలే చిక్కబడుతుండటంతో.దేశ వ్యాప్తంగా సంఘ్ పరివార్ కార్యకర్తల్లో ఆందోళన మొదలు అయింది.
ఒక వేళ దేశ వ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ కనుమరుగు అయ్యే పరిస్థితి వస్తే.అది బీజేపీకి పెద్ద మైనస్ గా మారుతుంది.
ఆర్ఎస్ఎస్ తోపాటే.బీజేపీ కూడా దేశంలో కనుమరుగు అవుతుందని.
కాంగ్రెస్ నేతలు అంటున్నారు.మరి నిజంగా ఆర్ఎస్ఎస్ కనుమరుగవుతుందా లేదా అనేది తెలాలంటే.
రాబోయే మహారాష్ట్రా ఎన్నికలు రావాల్సిందే.
