Bitter Gourd : పొరపాటున కూడా మీ ఇంట్లో ఇలాంటి మొక్కలను నాటకండి.. నాటితే మాత్రం..!

ఇంట్లో తులసి మొక్కను( Basil plant ) నాటడం ఎంతో శుభప్రదం అని పండితులు చెబుతున్నారు.తులసి, జమ్మి( Jammi ) వంటి మొక్కలు ఇంట్లో సానుకూల శక్తిని వచ్చేలా చేస్తాయి.

 Do Not Plant Such Plants In Your House Even By Mistake-TeluguStop.com

అయితే ప్రతి మొక్క ఇంటికి శ్రేయస్కరం కాదని నిపుణులు చెబుతున్నారు.వాస్తు శాస్త్రం ప్రకారం కాకరకాయ పాదు ని ఇంట్లో ఎప్పుడూ పెంచకూడదు.

ఇలా ఈ కాకరకాయ తీగ ని ఇంట్లో పెంచుకోవడం వల్ల ఇంటి ఆర్థిక స్థితి, కుటుంబ సభ్యుల ఆరోగ్యం పై ప్రభావం చూపుతుందని చాలా మంది ప్రజలు నమ్ముతారు.

Telugu Basil, Bitter Gourd, Jammi, Ravi Tree, Tamarind Tree, Thorn, Vastu Shastr

కాబట్టి ఇంట్లో కాకర మొక్కను( bitter gourd ) నాటడం మంచిది కాదు.వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఈ మొక్క నాటడం నిషేధించబడింది.ఎందుకంటే ఇది చేదుగా ఉంటుంది.

కాబట్టి దీని నుంచి వెలబడే శక్తి కూడా ప్రతికూలంగా ఉంటుంది.ఇంట్లో ప్రతికూలత వస్తుందని పెద్దవారు ఎప్పుడు చెబుతూ ఉంటారు.

ఇది కుటుంబ సభ్యుల మధ్య అసమ్మతి ఏర్పడేలా చేస్తుంది.ఇంటి వాతావరణాన్ని పాడుచేస్తుంది.

ఇంట్లో కాకరకాయ మొక్కలను నాటడం కుటుంబ సభ్యుల పురోగతిని ప్రభావితం చేస్తుందని చాలా మంది ప్రజలు నమ్ముతారు.

Telugu Basil, Bitter Gourd, Jammi, Ravi Tree, Tamarind Tree, Thorn, Vastu Shastr

కాబట్టి ఇంట్లో కాకరకాయ మొక్కను పెంచడం సుఖ సంతోషాలకు అశుభకరమైనదిగా భావిస్తారు.కాకరకాయ నుంచి వెలుపడే శక్తి కూడా ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.అంతేకాకుండా ఇంట్లో ఆర్థిక సంక్షోభం కూడా ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది.

కాబట్టి ఈ మొక్కను ఇంట్లో నాటడం నిషేధం అని వాస్తు శాస్త్రం చెబుతోంది.అంతేకాకుండా ఇంట్లో ముళ్ళ మొక్కలు, ఈత చెట్టు, చింత చెట్టు, రావి చెట్టు వంటివి నాటడం కూడా వాస్తు ప్రకారం మంచిది కాదని చెబుతున్నారు.

అయితే మీరు ఇంట్లో ఇప్పటికీ కాకరకాయ తీగను పెంచుకోవాలనుకుంటే దానిని మీ ఇంటి వెలుపల ఉన్న ఖాళీ స్థలంలో పెంచుకోవచ్చు.అప్పుడు ఇంటి సభ్యుల పై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube