జాతకంలో చంద్ర దోషం ఉన్నవారు గ్రహణ సమయంలో.. ఈ మంత్రాలను జపించడం మంచిది..!

మే 5వ తేదీన వైశాఖ మాసం పౌర్ణమి.ఈ పౌర్ణమినీ బుద్ధ పౌర్ణమి( Buddha full moon ) అని కూడా అంటారు.పౌర్ణమి రోజు భారతదేశంలో రాత్రి 8:44 నిమిషములకు చంద్రగ్రహణం మొదలై రాత్రి 10.52 నిమిషములకు ముగుస్తుంది.ఈ గ్రహణం మన దేశంలో కనిపించకపోయినా కొన్ని రాశులపై ప్రభావం చూపించనుంది.దీంతో మనుషులపై మంచి, చెడుల ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.ఈ చంద్రగ్రహణం ప్రత్యేకత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.చంద్రగ్రహణం పౌర్ణమి రోజు ఏర్పడింది.

 Those Who Have Moon Dosham In Horoscope Should Chant These Mantras During Eclips-TeluguStop.com

రాహు, కేతువు, చంద్రుడిని మింగినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది.అలాగే అమావాస్య రోజున సూర్యుడిని మింగినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.

రాహువు, కేతువు గ్రహాలు దుష్ట గ్రహాలుగా భావిస్తారు.దీని వల్ల కొన్ని రాశులపై తీవ్ర దుష్ప్రభావాలు చూపిస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు( Astrologers ) చెబుతున్నారు.

అంతేకాకుండా గ్రహణ సమయంలో కొన్ని పనులను చేయడం హానికరమని చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే గ్రహణ సమయంలో కొన్ని నియమాలను పాటించాలని చెబుతున్నారు.

గ్రహణం ఏర్పడే సమయంలో స్నానం మాచరించి మంత్రలను జపించడం శుభమని చెబుతున్నారు.గ్రహణం విడిచిన తర్వాత స్నానం ఆచరించడం మంచిది.చంద్రదోషం తొలగించుకోవడానికి గ్రహణ సమయంలో “ఓం శ్రీ శ్రీ చంద్రాంశే నమః”( Om Sri Sri Chandranshe Namah ) అనే మంత్రాన్ని పఠించడం వల్ల జాతకంలో చంద్ర దోషం తొలగిపోతుంది.చంద్రగ్రహణం సమయంలో గాయత్రి మంత్రం, మహా మృత్యుంజయ మంత్రం జపిస్తూ ఉండాలి.

అంతేకాకుండా మీ కులదైవాన్ని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ ఉండాలి.చంద్రగ్రహణ సమయంలో ఆర్థిక ఇబ్బందులు తగ్గించుకునేందుకు వైభవలక్ష్మి మంత్రం “ఓం శ్రీ హ్రీ క్లీం శ్రీ సిద్ధ లక్ష్మ్యై నమః” అంటూ 108 సార్లు జపించాలి.

ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.అలాగే శత్రువుల నుంచి రక్షణ కోసం గ్రహణ సమయంలో “ఓం హ్రీ బగలాముఖీ” అనే మంత్రాన్ని జపించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube