ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాను తెలుగులో గాడ్ ఫాదర్ సినిమా పేరుతో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను తెలుగు ఆడియన్స్ కు తగ్గట్టుగా ఈ సినిమాలో కొన్ని కీలక మార్పులు చేశారు.ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ సినిమా టెక్నికల్ టీమ్ లో రైటర్ గా పని చేస్తున్న లక్ష్మీ భూపాల ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.
రైటర్ గా అతడికి ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది.లక్ష్మీ భూపాల ఎక్కువగా నందినీరెడ్డి సినిమాలతో బాగా ఫేమస్ అయ్యారు.
మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఛాన్స్ రావడంతో అందరూ అతను స్టార్ రైటర్ అవుతారని భావించారు.

కానీ ఇలా ఊహించని విధంగా ఆయన సినిమా నుంచి తప్పుకున్నారు.అయితే దానికి గల కారణాలు ఏంటి అనేది మాత్రం వెల్లడించలేదు.ఇక లక్ష్మీ భూపాల స్థానంలో మరోక రైటర్ ని తీసుకోవడానికి గాడ్ ఫాదర్ టీం ప్రయత్నిస్తోంది.
ఇప్పటికే లక్ష్మీభూపాల కొంత భాగం రాయగా, అందులో కొన్ని సన్నివేశాల షూటింగ్ కూడా జరిగింది.మరి లక్ష్మీ భూపాల స్థానంలోకి ఎవరిని తీసుకొస్తారో చూడాలి మరి.లక్ష్మీ భూపాల గతంలో చిరంజీవి హీరోగా నటించిన ఖైదీ నెంబర్ 150, సైరా లాంటి సినిమాలకు కూడా పనిచేశారు.