పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన వకీల్ సాబ్ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.ఆ సినిమా కు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించాడు.
ఆ సినిమా సక్సెస్ అయితే వెంటనే అల్లు అర్జున్ హీరో గా ఐకాన్ అనే సినిమా ను మొదలు పెట్టాలని వేణు శ్రీరామ్ భావించాడు.వకీల్ సాబ్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.ఏకంగా రూ.100 కోట్ల కు పైగా కలెక్షన్స్ రాబట్టింది.అయినా కూడా వేణు శ్రీరామ్ ఇప్పటి వరకు తదుపరి సినిమా కు సంబంధించిన ఎలాంటి అప్డేట్ లేదు.అల్లు అర్జున్ తో చేయాల్సిన ఐకాన్ సినిమా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది.

అల్లు అర్జున్ పుష్ప సినిమా కి ముందు వేణు శ్రీరామ్ దర్శకత్వం లో ఐకాన్ సినిమా ను చేయాల్సి ఉంది.కానీ ఇప్పటి వరకు దర్శకుడు వేణు శ్రీరామ్ కి అల్లు అర్జున్ నుండి గ్రీన్ సిగ్నల్ రాలేదు.అంతే కాకుండా వేణు శ్రీరామ్ చెప్పిన ఐకాన్ స్క్రిప్ట్ విషయం లో కూడా అల్లు అర్జున్ అసంతృప్తి వ్యక్తం చేశాడనే ప్రచారం జరుగుతుంది.అల్లు అర్జున్ నో చెప్పడంతో మరో హీరో వద్దకు వేణు శ్రీరామ్ వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడా లేదా అనేది తెలియడం లేదు.

వకీల్ సాబ్ వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు వేణు శ్రీరామ్ తదుపరి సినిమా విషయం లో ఒక నిర్ణయానికి రాక పోవడం పట్ల ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు మీడియా సర్కిల్స్ వారు కూడా పెద్ద వివరిస్తున్నారు.సూపర్ హిట్ కొట్టి కూడా ఇలా చేతులు ముడుచుకొని కూర్చోవడం ఎంత వరకు కరెక్ట్ అంటూ కొందరు వేణు శ్రీరామ్ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.సక్సెస్ దక్కినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకో లేకపోతే దురదృష్టవంతుడు అవుతాడు.పాపం వేణు శ్రీరామ్ కెరియర్ ఇలా అయిందేంటంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.