1.ప్రధాని పర్యటనలో నల్ల బెలూన్లు.ఐదుగురి అరెస్ట్
ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ పర్యటనలో నిరసన తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది గన్నవరం ఎయిర్ పోర్ట్ సమీపంలో గాలిలోకి నల్ల బెలూన్లు ఎగరవేశారు.ఈ కేసుకు సంబంధించి ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు.
2.రాబోయే రోజులు కాంగ్రెస్ లోకి భారీ చేరికలు : భట్టి
రాబోయే రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్ లోకి ఇతర పార్టీ నుంచి పెద్ద ఎత్తున నాయకులు చేరబోతున్నారని సిఎల్పీ నేత మల్లు బట్టు విక్రమార్క అన్నారు.
3.అమర్నాథ్ యాత్రకు బ్రేక్
అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.ప్రతికూల వాతావరణ పరిస్థితులు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు.
4.వైసిపి ప్లీనరీలో పార్టీ నియమావళికి సవరణలు
త్వరలో జరగబోయే వైసిపి రాష్ట్ర ప్లీనరీలో పార్టీ నియమావళికి సంబంధించి కొన్ని సవరణలను ప్రతిపాదించి , వాటిని ఆమోదానికి పెడతామని వైఎస్ఆర్సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తెలిపారు.
5.జగన్ కడప పర్యటన ఖరారు
ఏపీ సీఎం జగన్ రెండు రోజులపాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు.జూలై 7,8 తేదీల్లో జగన్ కడప పర్యటన ఖరారు అయ్యింది.
6.జనసేన బీజేపీ లు కలిసే ఉన్నాయి : వీర్రాజు
జనసేన, బిజేపి లు కలిసే ఉన్నాయని, ఇందులో సందేహమే లేదు అని ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.
7.సుబ్బిరామిరెడ్డి ని కలిసిన జగ్గారెడ్డి
మాజీ ఎంపీ తిక్కవరపు సుబ్బరామిరెడ్డితో టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి భేటీ అయ్యారు.
8.భారత్ లో కరోనా
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 13,086 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
9.కాళీ చిత్ర పోస్టర్ వివాదం… దర్శకురాలి పై కేసు నమోదు
ఇటీవల విడుదలైన కాళీ చిత్ర పోస్టర్ పై వివాదం గత కొద్ది రోజులు జరుగుతోంది.తాజాగా ఈ పోస్టర్ పై ఢిల్లీకి చెందిన న్యాయవాది వినీత్ జిందాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
10.అనుమానస్పద స్థితిలో చిరుత మృతి
ఏపీలోని కర్నూలు జిల్లా ఆదోని మండలం బైచిగేరి సమీపంలో ఓ చిరుత పులి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
11.జగనన్న విద్యా కానుక ప్రారంభం
జగనన్న విద్యా కానుకను సీఎం జగన్ కర్నూలు జిల్లా ఆదోని లో మంగళవారం ప్రారంభించారు.
12.కాకతీయ ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరించిన కేటీఆర్
తెలంగాణ ప్రభుత్వం ఈనెల 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు కాకతీయ వైభవ సప్తాహాన్ని నిర్వహించనున్న నేపథ్యంలో ఈ ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ ను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.
13.పుట్టగొడుగులు తిని 18 మందికి అస్వస్థత
పుట్టగొడుగులు తిని 18 మంది అస్వస్థతకు గురైన ఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం పాల నాయుడుపేటలో చోటు చేసుకుంది.
14.ఐసీయూ లోనే లాలు ప్రసాద్ యాదవ్
రాష్ట్రీయ జనతా అధినేత బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్ రెండు రోజుల క్రితం మెట్ల పై నుంచి జారిపడిన సంగతి తెలిసిందే.ఆయన వీపు భాగాన గాయమై భుజం విరిగింది.అప్పటి నుంచి ఆయన ఐసీయూలోనే చికిత్స పొందుతున్నారు.
15.తెలంగాణ కు రాహుల్ గాంధీ
కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ మరోసారి తెలంగాణ పర్యటనకు రానున్నారు.
16.వివో కంపెనీ పై ఈడి దాడులు
చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ వివో, అలాగే సంబంధిత సంస్థలపై దేశవ్యాప్తంగా నాలుగు చోట్ల మనీ ల్యాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
17.బిజెపి రాష్ట్ర పదాధికారుల సమావేశం ప్రారంభం
బిజెపి రాష్ట్ర పదాధికారుల సమావేశం మంగళవారం ప్రారంభమైంది.బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.
18.ఏఐసిసి ప్రధాన కార్యదర్శి తో రేవంత్, భట్టి భేటీ
ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, పార్టీ సంస్థ గత వ్యవహారాల ఇంచార్జ్ కేసి వేణుగోపాల్ రెడ్డి తో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క భేటీ అయ్యారు.
19.వైఎస్ఆర్ వాహన మిత్ర లో కొత్త వారికీ అవకాశం
వైఎస్సార్ వాహన మిత్రలో పేరు నమోదు చేయించుకునేందుకు కొత్త వారికీ ప్రభుత్వం అవకాశం. కల్పించారు.ఈ నెల 7 వ తేదీ వరకు దీనికి సంబందించిన దరఖాస్తులు స్వీకరిస్తారు.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 48,100 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 52,470
.