టాలీవుడ్ ఇండస్ట్రీలోని పాపులర్ యాంకర్లలో రవి( Ravi ) ఒకరు అనే సంగతి తెలిసిందే.ఈ మధ్య కాలంలో యాంకర్ రవికి అవకాశాలు తగ్గాయి.
గతంలో యాంకర్ రవి లాస్య కలిసి చేసిన ప్రోగ్రామ్స్ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.అయితే ఒక ఇంటర్వ్యూలో భాగంగా నా భార్యకు అలాంటి దారుణమైన అవమానం జరిగిందని యాంకర్ రవి వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నేను నూటికి నూరు శాతం కమర్షియల్ అని రవి చెప్పుకొచ్చారు.సెలబ్రిటీలు( Celebrities ) ఎవరైనా డిమాండ్ కు అనుగుణంగా పారితోషికం తీసుకుంటారని రవి కామెంట్లు చేశారు.
ఏ మహిళకు కూడా ఎదురు కాని అవమానం నా భార్యకు ఎదురైందని ఆయన తెలిపారు.భార్యతో కలిసి ఒక ఫంక్షన్ కు వెళ్లగా రవి భార్య ఆ యాంకర్ కదా నువ్వు నీ భర్త అని చెప్పుకుని తిరుగుతున్నావేంటి అని అడిగారని రవి తెలిపారు.
ఆ రూమర్ల వల్ల వ్యక్తిగత జీవితంలో భార్య ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆయన కామెంట్లు చేశారు.బిగ్ బాస్ షో( Bigg Boss Show ) మైండ్ ను చెడగొట్టిందని ఆ షో వల్ల అక్కడ జరిగిన గొడవల వల్ల నేను నా కూతురి ముఖాన్ని కూడా మరిచిపోయానని రవి కామెంట్లు చేశారు.అమ్మాయిలతో ముడిపెట్టి ఎందుకు రూమర్లను క్రియేట్ చేస్తారో నాకు అర్థం కావడం లేదని యాంకర్ రవి పేర్కొన్నారు.
కొంతమంది యాంకర్లతో రూమర్లను సృష్టించడం జరిగిందని యాంకర్ రవి అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.రవి కెరీర్ పరంగా ప్రస్తుతం పరిమిత షోలతో బిజీగా ఉండగా రవి కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.యాంకర్ రవిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.
రాబోయే రోజుల్లో రవి కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాలి.