కొద్ది రోజుల క్రితం వరకు ఏపీలో సుడిగాలి పర్యటన చేస్తూ, జిల్లాల వారీగా రైతులను పరామర్శిస్తూ, హడావుడి చేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి చంద్రబాబు రాజకీయ వారసుడు నారా లోకేష్ ప్రస్తావన మరోసారి తెరపైకి వచ్చింది.ఇక నిత్యం ప్రజలతోనే ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతూ, వైసీపీ ప్రభుత్వం పై పోరాటం చేస్తారని అంతా ఆశించినా, లోకేష్ మాత్రం రెండు మూడు రోజులపాటు ఏపీలో తిరుగుతూ హడావుడి చేశారు.
అది కూడా టిడిపి అధినేత చంద్రబాబు పార్టీ రాష్ట్ర కమిటీలన ప్రకటించిన తర్వాత లోకేష్ పర్యటన చేశారు.అయితే పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు సమీపంలో ట్రాక్టర్ ప్రమాదం నుంచి తృటిలో బయటపడిన తరువాత లోకేష్ మళ్ళీ హైదరాబాద్ కే పరిమితమై పోయినట్టే గా కనిపిస్తున్నారు.
క్కడా ఆయన సందడి కనిపించడం లేదు.సోషల్ మీడియాలోనూ గతంలో ఉన్న అంత గట్టిగా ఉన్నట్టు కనిపించడం లేదు. రైతు పరామర్శ యాత్ర పేరుతో లోకేష్ హడావుడి చేసినా, ఆ తర్వాత ఇంకా అనేక ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహిస్తారని , పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చే అంతవరకు యాక్టివ్ గా నే ఉంటారని అభిప్రాయపడిన వారంతా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు.లోకేష్ హైదరాబాద్ పరిమితమైపోయిన దగ్గర నుంచి ఎన్నో రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
వైసిపి ప్రభుత్వం ను ఇబ్బంది పెట్టి అనేక సంఘటనలు జరిగాయి.అయినా, లోకేష్ మాత్రం ఎక్కడ యాక్టివ్ గా ఉన్నట్లుగా కనిపించడం లేదు.
లోకేష్ అప్పుడే ఏపీకి దూరం అయ్యి సుమారు 15 రోజులు గడుస్తున్నా, ఆయన కరోనా వైరస్ ప్రభావం కి గురయ్యారనే వార్తలను వైసీపీ శ్రేణులు హైలెట్ చేస్తూ వస్తున్నాయి.

అందుకే ఇంతగా సైలెంట్ అయ్యాయి అని, గతంలో ఏపీ సీఎం జగన్ పై మాస్క్ వ్యవహారం పై అనేక విమర్శలు చేశారని , ఇప్పుడు ఆయన ఆ ప్రభావానికి గురయ్యరు అంటూ హడావుడి చేస్తున్నాయి.ప్రస్తుతం చంద్రబాబు, లోకేష్ ఇద్దరు హైదరాబాద్ కి పరిమితం అయిపవడంతో అప్పుడు హడావుడి చేసిన వారంతా ఇప్పుడు సైలెంట్ అయ్యారు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి .ప్రస్తుతం ఏపీ బాధ్యతను అచ్చెన్న భుజ స్కంధాలపై వేయడంతో అన్ని వ్యవహారాలను ఆయనే చక్కబెడతారు అని, ఈ సమయంలో ఏపీలో తిరగడం అంత శ్రేయస్కరం కాదు అనే ఉద్దేశంతో లోకేష్ ,చంద్రబాబు ఇద్దరూ సైలెంట్ అయిపోయారు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.