సాహో టీజర్‌ టాక్‌ టాలీవుడ్‌ సినిమాలా లేదు, అంతకు మించి

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా రూపొందుతున్న ‘సాహో’ చిత్రం కోసం ఫ్యాన్స్‌ గత రెండు సంవత్సరాలుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్‌ నటించిన ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

 Prabhas Sahoo Teaser Talk1-TeluguStop.com

సుజీత్‌ దర్శకత్వంలో సాహో చిత్రం అంటూ దాదాపు అయిదు సంవత్సరాలుగా ప్రచారం జరుగుతోంది.రన్‌ రాజా రన్‌ చిత్రం విడుదలైనప్పటి నుండి కూడా ప్రభాస్‌ డేట్ల కోసం ఎదురు చూసిన సుజీత్‌ బాహుబలి పూర్తి అయిన తర్వాత ప్రభాస్‌ డేట్లు దక్కించుకున్నాడు.

సుజీత్‌ ఒక్క చిత్రం అనుభవంతోనే సాహో చిత్రాన్ని 300 కోట్ల బడ్జెట్‌తో ఎలా తెరకెక్కిస్తాడని అంతా అనుమానాలు వ్యక్తం చేశారు.అందరి అనుమానాలను పటాపంచలు చేసి అద్బుతమైన యాక్షన్‌ సీన్స్‌తో సినిమాను తెరకెక్కించినట్లుగా సాహో టీజర్‌ విడుదలైన తర్వాత వెళ్లడయ్యింది.

బాలీవుడ్‌ ముద్దుగుమ్మ శ్రద్దా కపూర్‌ను తీసుకున్న సుజీత్‌ సినిమాను బాలీవుడ్‌ స్థాయికి తీసుకు వెళ్లాడు.ఇక సినిమాలో యాక్షన్‌ సన్నివేశాలు చూస్తుంటే ఇది టాలీవుడ్‌ సినిమానేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

సాహో టీజర్‌ టాక్‌ టాలీవుడ్‌ స

హాలీవుడ్‌ రేంజ్‌ యాక్షన్‌ సన్నివేశాలు, స్టంట్స్‌ ఇలా అన్ని సీన్స్‌ కలిపి ఇది టాలీవుడ్‌ మాత్రమే కాదు హాలీవుడ్‌ సినిమాలకు కూడా మించి అన్నట్లుగా ఉంది.అద్బుతమైన టేకింగ్‌తో పాటు విజువల్‌ వండర్‌గా ఈ చిత్రం ఉండబోతుందని టీజర్‌ను చూస్తే అర్థం అయ్యింది.అందుకే ఈ చిత్రం రికార్డు స్థాయిలో బిజినెస్‌ చేయడం ఖాయం అయ్యింది.500 కోట్ల రూపాయల టార్గెట్‌తో ఈ చిత్రం విడుదలకు సిద్దం అవుతోంది.ఆగస్టు 15న విడుదల కాబోతున్న చిత్రం మరెన్ని రికార్డులను బద్దలు కొడుతుందో చూడాలి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube