యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు( Jr NTR ) నైజాంలో సైతం ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే సంగతి తెలిసిందే.స్టార్ హీరోల సినిమాలకు నైజాం కలెక్షన్లు( Nizam Collections ) ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
నైజాం టాప్5 లెక్కల్లో దేవర( Devara ) ఉండటం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం.బిజినెస్ విషయంలో మాత్రం ఎన్టీఆర్ వేరే లెవెల్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
నైజాంలో బిజినెస్ విషయంలో ఆర్.ఆర్.ఆర్( RRR ) టాప్ లో ఉంది.ఈ సినిమాకు ఏకంగా 70 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది.
కల్కి సినిమాకు( Kalki ) 65 కోట్ల రూపాయలు, సలార్( Salaar ) సినిమాకు 60 కోట్ల రూపాయలు, ఆదిపురుష్( Adipurush ) సినిమాకు 50 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరిగింది.ఈ సినిమాల తర్వాత నైజాంలో బిజినెస్ పరంగా 44 కోట్ల రూపాయలతో దేవర సినిమా ఉండటం గమనార్హం
నైజాంలో తారక్ ఈ సినిమాతో కలెక్షన్ల విషయంలో అదరగొట్టడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.గుంటూరు కారం, బాహుబలి2, సాహో, ఆచార్య, రాధేశ్యామ్ సినిమాలు తర్వాత స్థానాల్లో నిలిచాయి.నైజాంలో దేవర కలెక్షన్ల విషయంలో సైతం సంచలనాలు సృష్టించాలని అభిమానులు భావిస్తుండటం గమనార్హం.దేవర1 సినిమా బిజినెస్ విషయంలో ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారు.
180 కోట్ల రూపాయల భారీ బిజినెస్ తో దేవర భారీ స్థాయిలో బిజినెస్ చేసిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.దేవర సినిమా రెండు భాగాలుగా కావాలని చేయలేదని స్క్రిప్ట్ డిమాండ్ చేయడం వల్ల మాత్రమే రెండు భాగాలుగా తెరకెక్కిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. దేవర సినిమా లాభాలు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూడాలి.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఈ సినిమా ఫుల్ మీల్స్ లా ఫుల్ ట్రీట్ లా ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.