ఆన్‌లైన్ షాపింగ్‌కు చిరునామాగా మారిన అమెజాన్, ప్లిఫ్‌కార్ట్, బిగ్ బాస్కెట్ వంటి వెబ్‌సైట్లలో కొనుగోళ్లను మరింత సులభతరం చేసే దిశగా ఆర్‌బీఐ చర్యలు చేపడుతోంది.ఇందులో భాగంగా తాజాగా టోకనైజేషన్ అనే సరికొత్త పేమెంట్ సిస్టంను ప్రవేశపెట్టింది.
ఈ చెల్లింపు వ్యవస్థ వచ్చే ఏడాది జనవరి నుంచి అమల్లోకి వస్తుంది.ఈ చెల్లింపు విధానం ద్వారా చెల్లింపు దారులు తమ క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలను తెలపాల్సిన అవసరం లేకుండానే కొనుగోళ్లు జరపడం వీలవుతుంది.
తద్వారా వారి కార్డు సమాచారం చాలా సురక్షితంగా ఉంటుంది.అలాగే మెరుగైన భద్రతతో లావాదేవీలు చేసుకోవడం సాధ్యమవుతుంది.
టోకనైజేషన్‌తో ఆన్‌లైన్ మోసాలను అరికట్టవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలుపుతోంది.
వ్యక్తిగత సమాచారంతో సంబంధం లేకుండా ఆన్‌లైన్ కొనుగోళ్లు సజావుగా సాగే విధానాన్నే టోకనైజేషన్ అని పిలుస్తారు.
ఈ విధానంలో మీరు బ్యాంకింగ్ సేవలను వినియోగించుకునేటప్పుడు సీవీవీ నంబర్ నమోదు చేయాల్సిన అవసరం ఉండదు.టోకనైజేషన్ సేవలను ఉపయోగించుకోవడానికి ఆన్‌లైన్ వెబ్‌సైట్లలో ప్రొడక్ట్స్ కొనుగోలు చేసేటప్పుడు కార్డుకు సంబంధించిన పూర్తి సమాచారం నమోదు చేయాల్సి ఉంటుంది.
అనంతరం వెబ్‌సైట్లలో చెక్ అవుట్ పేజీలో కార్డు వివరాలను ఎంటర్ చేయాలి.ఆపై టోకనైజేషన్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది.

కొనుగోలుదారులు తమకు నచ్చినన్ని కార్డులను టోకనైజ్ చేసుకోవచ్చు.కానీ ఇది విదేశీ కార్డులకు ఇది వర్తించదు.టోకనైజేషన్ వ్యవస్థతో హ్యాకర్లు కొనుగోలుదారుల కార్డు వివరాలను తెలుసుకోలేరు.అలాగే ఇకపై 16 అంకెల కార్డు వివరాలను, కార్డు గడువు తేదీ, సీసీవీ తదితర సమాచారం ప్రతిసారి ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు.