ఇప్పటివరకు ఆర్ఆర్ఆర్ సినిమా చూడని అజయ్ దేవగన్... కారణం ఏంటో తెలుసా?

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే.

పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకుంది.

ఇక ఈ సినిమా విడుదల అయ్యి దాదాపు 35 రోజులు కావస్తోంది.కలెక్షన్ల పరంగా అద్భుతమైన రికార్డులు సాధించిన ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ తో పాటు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా నటించారు.

ఈ క్రమంలోనే బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ఈ సినిమాలో చిన్నప్పటి రామ్ చరణ్ తండ్రి పాత్రలో నటించారు.ఇక ఈ సినిమాలో అజయ్ దేవగన్ పాత్ర నిడివి తక్కువగా ఉన్నప్పటికీ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.

ఇకపోతే దేశవ్యాప్తంగా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న ఈ సినిమాని ఇప్పటివరకు అజయ్ దేవగన్ చూడక పోవడం గమనార్హం.అయితే ఇప్పటి వరకు అజయ్ దేవగన్ ఈ సినిమాని ఎందుకు చూడలేదు అనే విషయానికి వస్తే.

Advertisement

సాధారణంగా ఆయన నటించిన సినిమాలు విడుదలైన వెంటనే ఆయన చూస్తే ఓకే.లేదా ఆ సినిమాలను చాలా ఆలస్యంగా చూడాల్సి వస్తే ఇకపై ఆ సినిమాలను ఎప్పటికీ అజయ్ దేవగన్ చూడరట.

ఈ విధంగా అజయ్ దేవగన్ సినిమాలు చూడడానికి కూడా ఒక కారణం ఉంది.సినిమాలు విడుదలై చాలా రోజుల తర్వాత ఆ సినిమాని చూస్తే ఆ సినిమా చూస్తున్న క్షణంలో ఆ పాత్రలో అలా కాకుండా ఇంకా బాగా నటించాల్సి ఉండేదనే భావన తనలో కలుగుతుందట.అయితే అంతకన్నా బాగా నటించడం కుదరదు కనుక అలాంటి భావన రాకుండా ఉండడం కోసమే అజయ్ దేవగన్ తన సినిమాలు చూడరని ఓ సందర్భంలో వెల్లడించారు.

ఈ క్రమంలోనే RRR సినిమా కూడా చూడలేదని అజయ్ దేవగన్ తెలియజేశారు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు