గంగా న‌దిపై విహ‌రించ‌నున్న డ‌బుల్ డెక్క‌ర్ క్రూయిజ్‌... ఇక రామ‌నామంతో పుల‌కింత‌లే...

గంగానది సాంస్కృతిక మరియు ఆధ్యాత్మికత గొప్ప‌ద‌నాన్ని తెలియ‌జేసందుకు రూపొందించిన‌ క్రూయిజ్‌ను ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించినప్పుడు, కాశీలో గంగానది అలలపై నడిచిన క్రూయిజ్‌ను ప్రపంచం అంతా చూసింది.తద్వారా భారత్ స‌రికొత్త చరిత్రను నమోదు చేసింది.

 A Double Decker Cruise On The River Ganges Details, Double Decker Cruise, Ganga-TeluguStop.com

అయితే ఇప్పుడు మ‌రో కొత్త చరిత్రను సృష్టించేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభ‌మ‌య్యాయి.ఇప్పుడు దానికి అయోధ్య పేరును చేర్చబోతున్నారని స‌మాచారం.

డబుల్ డెక్కర్ క్రూయిజ్‌ని నడపడానికి సన్నాహాలు జ‌రుగుతున్నాయి.సరయూ తరంగాలపై నడిచే ఈ క్రూయిజ్‌లో శ్రీరాముని జీవిత గ‌మ‌నాన్ని చూపడంతో పాటు, పర్యాటకులు మరియు భక్తుల‌కు రామభజన వినే అవకాశం క‌లుగుతుంది.

క్రూయిజ్ పొడవు 26 మీటర్లు, వెడల్పు 8.30 మీటర్లు.క్రూయిజ్ సౌర ఫలకాల సాయంతో నడుస్తుంది.దాని మొదటి అంతస్తులో 72 నుండి 100 మంది వరకు సీటింగ్ ఉంటుంది.పై అంతస్తు ఖాళీగా ఉంటుంది.సరయూ విహార్ వీక్షణను ఇక్క‌డి నుంచి ఆస్వాదించ‌వ‌చ్చు.

గుప్తర్ ఘాట్ వద్ద దీనికి వర్క్ షాప్ కూడా నిర్మిస్తున్నారు.డబుల్ డెక్కర్ క్రూయిజ్ ఎక్కడ నిర్మించబడుతుందంటే.

కేరళ నుంచి క్రూయిజ్ పార్ట్స్ వస్తాయి.కేరళ నుంచి ముడిసరుకు తీసుకురావాల్సి ఉంటుంది.

దీని ముడిసరుకు మరియు అచ్చు కూడా కేర‌ళ నుండి వస్తాయి.ఈ క్రూయిజ్‌ 100 మంది సామర్థ్యం కలిగి ఉంటుంది.

Telugu Ayodhya, Cruise Ship, Devotees, Doubledecker, Ganga River, Kerala, Sri Ra

ఇందులో పడకగది, విహారయాత్రికుల‌కు వ‌స‌తి, టాయిలెట్ మరియు 100 మంది కూర్చునే సామర్థ్యం ఉంటాయి.దీని పొడవు 26 మీటర్లు మరియు వెడల్పు 8.3 మీటర్లు, అలాగే డబుల్ డెక్కర్ ఉంటుంది.మొదటి అంతస్తు డెక్ సీటింగ్ కెపాసిటీని కలిగి ఉంటుంది.

పైన ఉన్న రెండవ డెక్ పూర్తి ఖాళీ స్థలాన్ని కలిగి ఉంటుంది.ఈ క్రూయిజ్ సోలార్ ప్యానెల్స్ సాయంతో నడుస్తుంది.

భక్తులకు, పర్యాటకులకు ఇలాంటి సౌకర్యాలు పెంచడం ద్వారా పర్యాటకానికి కొత్త అవకాశాలు పెరుగుతాయని జిల్లా యంత్రాంగం భావిస్తోంది.

Telugu Ayodhya, Cruise Ship, Devotees, Doubledecker, Ganga River, Kerala, Sri Ra

క్రూయిజ్ విలాసవంతంగా ఉంటుందని చెబుతున్నారు.ఇందులో వినోదానికి సంబంధించిన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.అలాగే దీనిలో రెస్టారెంట్‌తో కూడా ఉంటుంది.

ఈ ఏడాది దీపావళి లోపు ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నిస్తోంది.తద్వారా దీపోత్సవ్ నుండి భ‌క్తులు దీనిలో విహ‌రించ‌వ‌చ్చు.అయోధ్య అభివృద్ధి మరియు విస్తరణలో దీనిని ఒక బెంచ్‌మార్క్‌గా సెట్ చేసే ప్రయత్నం జరుగుతోంది.2024కి ముందు లేదా తర్వాత అయోధ్యకు ఇది కొత్త రూపాన్ని తీసుకువ‌స్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube