Puri Jagannadh : పూరి షాకింగ్ కామెంట్స్….మహేష్ కి నిజంగానే ఇష్టం లేదా?

తెలుగు సినీ పరిశ్రమలో మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో ఒకరు పూరి జగన్నాథ్.బద్రి, ఇడియట్, పోకిరి( Pokiri Movie ) వంటి కల్ట్ క్లాసిక్ చిత్రాలను ఎన్నో అందించారు పూరి జగన్నాథ్.

 Puri Jagannadh Shocking Comments Mahesh Really Doesnt Like It-TeluguStop.com

పాన్ ఇండియా డైరెక్టర్ గా పేరు తెచ్చుకొని, ఇండియాలో నెంబర్ 1 డైరెక్టర్ గా ఉన్న రాజమౌళి కూడా తాను పూరి జగన్నాథ్ లాగా సినిమా తీయలేను అని సభా ముఖంగా ఒప్పేసుకున్నారు.అలంటి ఈ స్టార్ డైరెక్టర్ ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు పై షాకింగ్ కామెంట్స్ చేసారు.

Telugu Badri, Mahesh Babu, Pokiri, Puri Jagannadh, Tollywood-Movie

మహేష్ బాబుపూరి జగన్నాథ్ కాంబినేషన్ అంటే ఫాన్స్ కు పండగే.మహేష్ ( Mahesh babu )కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ పోకిరి, బిసినెస్ మాన్ …ఈ రెండు చిత్రాలు తీసింది పూరి జగన్నాథ్ ఏ.ఇలాంటి క్లాసిక్ హిట్స్ ఇచ్చిన పూరి ని మహేష్ పట్టించుకోవట్లేదా ? అవకాశాలు ఇవ్వడం లేదా? తాజాగా పూరి చేసిన కామెంట్స్ చూస్తుంటే అలానే అనిపిస్తుంది.పూరి జగన్నాథ్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ…తనకు చాలామంది మహేష్ బాబు ఫాన్స్ మెసేజ్ చేస్తుంటారని, మహేష్ తో మళ్ళీ సినిమా చెయ్యమని అడుగుతుంటారని అన్నారు.

కానీ వాళ్లకు తెలియని విషయం ఏమిటంటే, తను ప్లాప్ సినిమాలు తెస్తే ఏ హీరో ఛాన్స్ ఇవ్వడని అన్నారు.అందుకే తనకు మహేష్ కన్నా మహేష్ ఫాన్స్ అంటే ఎక్కువ ఇష్టం అని, ఎందుకంటె మహేష్ కు తన మీదా లేని నమ్మకం, మహేష్ ఫాన్స్ కి ఉందని కుండ బద్దలు కొట్టేసారు.

Telugu Badri, Mahesh Babu, Pokiri, Puri Jagannadh, Tollywood-Movie

పోకిరి, బిసినెస్ మాన్ చిత్రాల తరువాత పూరి జగన్నాథ్( Puri Jagannadh )డ్రీం ప్రాజెక్ట్ “జన గణ మన” మళ్ళీ మహేష్ తోనే చేస్తారని రూమర్స్ వినిపించాయి.కానీ పూరి వరుస ఫ్లోప్స్ తో ఫామ్ లో లేకపోడంతో ఆ ప్రాజెక్ట్ అటకెక్కింది.అదే చిత్రాన్ని విజయ్ దేవరకొండ తో అనౌన్స్ చేసారు పూరి.కానీ లైగర్ ఆశించిన విజయం సాధించలేదు కనుక ఇప్పుడు విజయ్ కూడా ఈ ప్రాజెక్ట్ కు దూరమవుతున్నటు తెలుస్తోంది.

అయితే ప్లాప్స్ లో ఉన్న ప్రతిసారి పూరికి మహేష్ అవకాశం ఇచ్చారని ఒక వర్గం మహేష్ ఫ్యాన్స్ పూరి పై ఫైర్ అవుతున్నారు.ఆంధ్రావాలా, 143, సూపర్ సినిమాల ప్లాప్ తర్వాత మహేష్ పోకిరి సినిమా చేసారని, అలాగే నేనింతే, ఏక్ నిరంజన్, బంపర్ ఆఫర్, గోలీమార్, నేను నా రాక్షషి వంటి కొన్ని యావరేజ్ మరియు ప్లాప్ సినిమాల తర్వాత బిజినెస్ మ్యాన్ చేసారని, పూరి కి ప్రతిసారి ప్లాప్స్ తర్వాత మహేష్ బాబు హిట్ సినిమా ఇచ్చాడని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube