Rashmika Mandanna Sana Mir : అచ్చం మన నేషనల్ క్రష్ రష్మిక లా ఉన్న ఈమె ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు!!

ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రష్మిక.( Rashmika Mandanna ).తక్కువ సమయంలోనే అనేక విజయాలు అందుకొని నేషనల్ క్రష్ గా మారిపోయింది.ఇక పుష్ప చిత్రంతో ఆమె క్రేజ్ రెండింతలయింది.

 You Will Be Surprised To Know Who She Is Who Looks Like Our National Crush Rash-TeluguStop.com

పుష్పలో శ్రీవల్లి గా ఆమె నటన అందర్నీ ఆకట్టుకుంది.వరుస విజయాలతో సౌత్ లో అదరగొట్టిన ఈ భామ, ఇప్పుడు బాలీవుడ్ లో దుమ్ము దులుపుతోంది.

గుడ్ బై చిత్రం( Goodbye )లో ఏకంగా అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించే అవకాశం కొట్టేసింది.ప్రస్తుతం తమిళ స్టార్ విక్రమ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది రష్మిక.

ఈ చిత్రంలో విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.ఇదిలా ఉండగా, ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆచం రష్మిక లాగానే ఉన్న మరో సెలబ్రిటీ ఫోటో వైరల్ అవుతోంది.ఆమె ఎవరో ఇప్పుడు చూదాం…

Telugu Bollywood, Pakistan, Tollywood, Womens Cricket-Movie

ఆచం రష్మిక లా కనిపిస్తున్న ఈ అమ్మాయి పేరు “సన మీర్( Sana Mir )”.ఆమె పాకిస్థాన్ ఉమెన్స్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్.పాకిస్థాన్ ఉమెన్స్ క్రికెట్ టీం తరుపున 14 ఏళ్ళ పాటు ఆడి, అనేక ప్రశంసలు,బహుమతులు అందుకుంది.క్రికెట్ కెరీర్ లో అసాధారణ ఆటతీరు ప్రదర్శించిన సన మీర్ ఒక ఆఫ్ స్పిన్నర్.

తన క్రికెట్ కెరీర్ లో 226 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన సన, 137 మ్యాచ్ లకు టీం కెప్టెన్ గా వ్యవహరించింది.పాకిస్తాన్ ఉమెన్స్ క్రికెట్ లో వన్ డే క్రికెట్ లో 100 వికెట్లు తీసిన మొదటి బౌలర్ సన.2018 ఐసీసీ వన్డే బౌలర్ ర్యాంకింగ్‌లో నంబర్ 1 స్థానం సాధించి, ఈ ఘనత సాధించిన మొదటి పాకిస్తానీ మహిళా ప్లేయర్ గా రికార్డు నెల్కొలిపింది.ఆసియా క్రీడలలో 2010, 2014 సంవత్సరాలలో పాకిస్తాన్ కు రెండు బంగారు పతకాలు అందించింది.

సన 2009 నుంచి 2017 వరకు పాకిస్తాన్ టీం కు సారధ్యం వహించింది.ఆమె తన కెరీర్ లో మొత్తం 240 అంతర్జాతీయ వికెట్లు పడగొట్టింది.2020 లో తను అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యింది.

Telugu Bollywood, Pakistan, Tollywood, Womens Cricket-Movie

రిటైర్మెంట్ అనంతరం ఆమె పాకిస్తాన్ క్రికెట్ లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది.37 ఏళ్ళ సన పాకిస్తాన్ క్రికెట్ టీం లో అందమైన ప్లేయర్స్ లో ఒకరు.ఆమె ఆటకే కాదు, ఆమె నవ్వుకి, క్యూట్ లుక్స్ కి కూడా చాలామంది ఫాన్స్ ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube