ఫైలిఫీన్స్ లో తెలుగు వైద్య విద్యార్ధి మృతి..!!!

విదేశాలలో ఉన్నత చదువులు చదివి ఆర్ధికంగా స్థిరపడాలని ఎంతో మంది భారతీయులు తమ సొంత ఊళ్ళని వదులుకుని , తల్లి తండ్రులకి దూరంగా ఉంటూ, ఎంతటి ఇబ్బందులు ఉన్నా విదేశాలలో చదువుకోవడానికి వెళ్తారు.అక్కడ పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటూ, మరో పక్క చదువుకుంటూ తమ కలలు నెరవేరాలని తల్లి తండ్రులని బాగా చూసుకోవాలని ఆరాటపడుతుంటారు.

 Study In Philippians Ponnapalli Jagadhesh-TeluguStop.com

కానీ విధి కొంతమంది కలలని నెరవేర్చక పోగా వారిని కానరాని లోకాలకి తీసుకుపోతుంది.వారి తల్లి తండ్రులకి శాశ్వతంగా దూరం చేస్తుంది.

ఇలాంటి సంఘటనే ఇప్పుడు ఫైలిఫీన్స్ లో చోటు చేసుకుంది.వెటర్నరీ వైద్య విద్యని అభ్యసించడానికి ఫైలిఫీన్స్ వెళ్ళిన ఓ విద్యార్ధి అక్కడి రోడ్డు ప్రమాదంలో మరణించాడు.

మూడేళ్ళ కోర్సు పూర్తి చేసుకుని ఇంకొక ఏడాది లో తమ ఇంటికి వచేస్తాడని అనుకున్న ఆ తల్లి తండ్రుల ఆశలు అడియాశలు అయ్యాయి.కృష్ణా జిల్లా నందిగామలోని నేతాజీ నగర్ కి చెందిన పొన్నపల్లి జగదీశ్ అనే యువకుడు వైద్య విద్య కోసం 2016 లోనే ఫైలిఫీన్స్ వెళ్ళాడు.

Telugu Indian Road, Philippians, Telugu Nri Ups-

ప్రస్తుతం నాలుగో ఏడాది చదువుతున్న జగదీష్ సోమవారం రోజున షాపింగ్ కి తన ద్విచక్ర వాహనం పై వెళ్తున్న సమయంలో వెనుక నుంచీ వచ్చిన బస్సు అతడిని బలంగా డీ కొట్టడంతో ఒక్క సారిగా అతడు గాలిలో పల్టీలు కొట్టి తీవ్రంగా గాయపడ్డాడు.హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడని తెలుస్తోంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube