ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వైసీపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను కూడా తమ సొంత ఖాతా నుండి ఇస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని విమర్శించారు.
బటన్ ఒక్కటమే పనిగా వైసీపీ వ్యవహరిస్తుందని సీరియస్ ఆరోపణలు చేశారు.అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలైనా గాని రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని పేర్కొన్నారు.
అన్ని రకాలుగా జగన్ ప్రభుత్వం విఫలమైందని స్పష్టం చేశారు.
వైసీపీ ప్రభుత్వం బుర్ర లేని ప్రభుత్వం అని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 35 లక్షల ఇళ్ళను మంజూరు చేస్తే. ఇంతవరకు వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేదని సీరియస్ ఆరోపణలు చేశారు.
కనీసం రాష్ట్రానికి రాజధాని కూడా లేకుండా చేశారని అన్నారు.ఈనెల 21వ తారీకు విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
ఆ సభలలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం ఎండగడతామని అన్నారు.ఏపీలో మంచి రోజులు రావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని సోము వీర్రాజు తెలియజేశారు.