ఆసియాలో అతి పెద్ద ఆదివాసుల పండుగలో ఒకటైన మెగా మేడారం జాతర యొక్క చిన్న జాతర ఈరోజు ఎంతో వైభవంగా మొదలైంది.రాష్ట్ర ప్రభుత్వం ద్వైవార్షిక జాతరను అధికారికంగా నిర్వహిస్తూ ఉంది.
అయితే దేవాలయ పూజారులు ఈ మధ్య సంవత్సరంలో భక్తుల అభ్యర్థన మేరకు మినీ జాతర నిర్వహిస్తున్నారు.సమ్మక్క సారలమ్మ మేడారం దేవాలయ పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు చెప్పిన వివరాల ప్రకారం ఈరోజు దేవాలయ శుద్ధి, పూజా తదితర కార్యక్రమాల్లో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
ఫిబ్రవరి 2న సమ్మక్క సారలమ్మ దేవతలకు పసుపు, పచ్చిపాలతో పూజలు చేస్తారు.మండ మెలిగే ఆచారం ఫిబ్రవరి మూడు, నాలుగు తేదీల్లో జరగనుంది.
గిరిజన జాతరకు భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున అవసరమైన పూర్తి ఏర్పాట్లను జిల్లా అధికారులు ఏర్పాటు చేశారు.అంతేకాకుండా గతంలో ఈ మినీ మేడారం జాతరకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు మాత్రమే వచ్చేవారు.
కానీ ఇప్పుడు రాష్ట్రం నలుమూలల నుంచి ఈ జాతరకు జనం తరలివస్తున్నారు.రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర మధ్యలో మినీ జాతర పేరిట ఈ ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు.
అయితే ఇందులో భాగంగా ఈరోజు మండ మేలిగే పండుగతో మినీ జాతర మొదలవుతుంది.గురు, శుక్రవారాల్లో సరలమ్మ సమ్మక్క గద్దలను శుద్ధి చేసి భక్తులు తమ మొక్కులను సమర్పించుకునేందుకు అనుమతిని కల్పిస్తారు.
ఈ మినీ జాతరలో అమ్మవార్లను గద్దెల పైకి తీసుకురావడం జరగదని గద్దెలపై ప్రత్యేక పూజలు మాత్రమే చేస్తామని పూజారులు వెల్లడించారు.

ఈరోజు నుంచి మినీ మేడం జాతర మొదలవుతుంది.ఇంకా చెప్పాలంటే మేడారం మినీ జాతర సందర్భంగా రెండు రోజుల నుంచి మేడారానికి భక్తులు భారీగా తరలిస్తున్నారు.తలనీలాలు సమర్పించి జంపన్న వాగులో పుణ్య స్థానాల్లో ఆచరించి అమ్మవార్లకు బంగారాన్ని నివేదించి మొక్కులు తీర్చుకుంటున్నారు.
మేడారం మినీ జాతరకు దాదాపు 5 లక్షల మంది భక్తులు తరలి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.