సోనూ సూద్ ఫోటోను అక్కడ పచ్చబొట్టుగా వేసుకున్న అభిమాని.. వైరల్ ఫోటో?

సోనూ సూద్ అనే పేరు తెలియని వాళ్లే లేరు అని చెప్పాలి.దేశం మొత్తం తనేంటో తెలిసేలా చేశాడు సోనూ సూద్.

 Sonusood Fan Tattooed Sonu Soods Photo On Heart Viral Photo Details, Sonusood, S-TeluguStop.com

సినీ ఇండస్ట్రీకి చెందిన నటుడు సోనూ సూద్.ఎక్కువగా విలన్ క్యారెక్టర్లలో నటించి తనకంటూ చెరగని ముద్ర సంపాదించుకున్నాడు.

కొన్ని సినిమాలల్లో ప్రధాన పాత్రలలో కూడా నటించాడు.కేవలం తెలుగులోనే కాకుండా హిందీ భాషలో కూడా నటించాడు సోనూ.

అయితే దేశానికి కోవిడ్ వ్యాపించక ముందు ఈయన కేవలం ఒక నటుడు అని మాత్రమే అందరికీ తెలుసు.కానీ ఎప్పుడైతే దేశాన్ని కోవిడ్ పట్టి పీడించిందో అప్పటినుంచి ఈయన జనాలకు మంచి మనసున్న వ్యక్తిగా పరిచయమయ్యాడు.

రీల్ లైఫ్ లో విలన్ క్యారెక్టర్ తో భయపెట్టించిన సోను.రియల్ లైఫ్ లో మాత్రం ఎంతోమందికి సహాయం చేసి రియల్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు.

Telugu @sonusoodarmy, Sonusood, Covid Sonusood, Sonusood Fan, Sonusoodfan, Sonus

గత కొన్ని ఏళ్ల కిందట దేశాన్ని కోవిడ్ పట్టి పీడిస్తున్న సమయంలో.నేనున్నాను అంటూ ముందుకు వచ్చాడు సోను.తనకు తోచిన సహాయంతో అందరిని కాపాడాడు.వలసకు వెళ్లిన ప్రజలు కోవిడ్ వల్ల ఒకచోట ఇరకటంతో వారిని క్షేమంగా ఇంటికి పంపించేలా చేశాడు.  అంతేకాకుండా కోవిడ్ వచ్చిన వాళ్లకు వైద్యం కూడా అందించాడు.ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఏదో ఒక విధంగా సహాయం చేస్తూనే ఉన్నాడు.

కేవలం కోవిడ్ వచ్చిన వాళ్లకే కాకుండా.రైతులకు, విద్యార్థులకు, మహిళలకు, చిన్నపిల్లలకు ఇలా వారి నిత్యవసరాలను అందిస్తూ వచ్చాడు.రైతులకు మాత్రం ట్రాక్టర్లు ఇప్పించి రాజకీయ నాయకులను నోటి మీద వేలు వేసుకునేలా చేశాడు.ఆ సమయంలో పలువురు రాజకీయ నేతలు ఈయనను బాగా టార్గెట్ కూడా చేశారు.

లేని పోనీ నిందలు కూడా వేశారు.

Telugu @sonusoodarmy, Sonusood, Covid Sonusood, Sonusood Fan, Sonusoodfan, Sonus

కానీ తనేంటో ప్రజలకు తెలియడంతో రాజకీయ నాయకులు సైలెంట్ అయ్యారు.ఇక ఈయన పేరు మీద ప్రత్యేకంగా ఫౌండేషన్ కూడా ఏర్పాటు చేశారు.ఆ ఫౌండేషన్ ద్వారా ప్రతిరోజ సహాయం చేస్తూనే ఉన్నారు.

ఇక ఈయన అంటే పడిచచ్చే అభిమానులు కూడా ఉన్నారు అంటే నమ్మక తప్పదు.ఎందుకంటే ఆయన చేసిన సహాయం చెప్పలేనిది కాబట్టి.

ఇక ఈయన సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటాడు.ఎవరైనా ఆయనను సోషల్ మీడియాలో సహాయం కోరితే చాలు వెంటనే కాదనకుండా చేసేస్తాడు.అంతేకాకుండా వారి దగ్గరికి స్వయంగా వెళ్లి వారి బాధలు కూడా తెలుసుకుంటాడు.ప్రస్తుతం ఈయనకు దేశంలో మంచి అభిమానం ఉంది.

Telugu @sonusoodarmy, Sonusood, Covid Sonusood, Sonusood Fan, Sonusoodfan, Sonus

అప్పుడప్పుడు అభిమానులు ఈయన పేరు మీద ఇతరులకు కూడా సహాయం చేస్తూ ఉంటారు.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈయన అభిమాని ఈయన ఫోటోను తన గుండెలపై పచ్చబొట్టుగా వేయించుకున్నాడు.అది చూసి సోను ఫిదా అయ్యి ఆ ఫోటోను తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.అయితే ఇటువంటివి నాకు వద్దు సోదరా అంటూ.కానీ ఇది మాత్రం వినయపూర్వకంగా ఉంది అని కృతజ్ఞతలు తెలిపాడు సోను.ప్రస్తుతం ఆ పచ్చబొట్టు ఫోటో బాగా వైరల్ అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube