ఇండియాతో పాటు పలు దేశాల్లో హిందూ దేవాలయాలకు చెందిన రహస్యాలు పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు కూడా గుర్తించలేక పోతున్నారు.ప్రస్తుతం ఒక దేవాలయం గురించి ప్రస్తుతం మీడియాలో ప్రముఖంగా వార్తలు వస్తున్నాయి.
ఆ గుడిపై ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా పిడుగు పడటం ఖాయం.ఆ పిడుగుకు గుడిలో ఉన్న శివ లింగం బద్దలు కావడం, ఒకటి రెండు రోజుల్లో ఆ శివలింగం మళ్లీ యధా స్థితికి చేరుకుని అతుక్కోవడం జరుగుతుంది.
ఈ పరిణామాలు అంతా కూడా అవాక్కయ్యేలా ఉన్నాయి.ఈ రహస్యం ఏంటీ అనేది శాస్త్రవేత్తలు గుర్తించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.వందల సంవత్సరాలుగా త్రపి 12 ఏళ్లకు ఒకసారి పిడుగు పాటు కన్ఫర్మ్.పిడుగు పడుతుందనే విషయం ముందే అర్థం అవుతుంది.
దాంతో ఆ గుడికి సమీపంలోకి ఎవరు వెళ్లరు.ముఖ్యంగా శివరాత్రి సమయంలో పిడుగు పడుతుందని స్థానికులు చెబుతూ ఉంటారు.
హిమాచల్ ప్రదేశ్‌లోని కులూ వ్యాలీలో ఈ గుడి ఉంది.

అక్కడ గత కొంత కాలంగా ఈ గుడిపై పిడుగు పడటంతో గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల వారు అంతా కూడా ఆ గుడిని ప్రముఖంగా పూజిస్తూ ఉంటారు.పూర్వ కాలంలో ఒక సర్పం చుట్టుపక్కల గ్రామాలను నాశనం చేస్తున్న సమయంలో ఇక్కడ శివాలయం ఏర్పడినది అని, అప్పటి నుండి అక్కడి వారు ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవిస్తున్నారని స్థల పురాణం చెబుతోంది.మొత్తానికి పిడుగు పడటం అనేది చాలా విభిన్నంగా ఉందంటూ శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యంగా ఉన్నారు.
ఈ గుడిపై చాలా ఏళ్లుగా పరిశోదనలు జరుగుతున్నాయి.