Rajinikanth : ఫ్యాన్స్ పై అంత ప్రేముంటే ఇంట్లోకి పిలిపించుకోండి.. రజనీపై వృద్ధ మహిళ సెటైర్లు వైరల్!

సూపర్ స్టార్ రజనీకాంత్( Rajinikanth ) ఇప్పటికీ అదే ఊపుతూ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.70 ఏళ్ల వయసులో కూడా ఏమాత్రం తగ్గకుండా అదే ఎనర్జీతో సినిమాలలో నటిస్తున్నారు రజనీకాంత్.ఇప్పటికీ సినిమాలతో ఎంటర్‌టైన్‌ చేస్తూనే ఉన్నారు.ఈయన పుట్టిరోజు నాడు, పండుగలు ఉన్న సందర్భాల్లో అభిమానులు ఈయన ఇంటి ముందు సందడి చేస్తుంటారు.రజనీకాంత్‌ ఇంటి బయటకు వచ్చి చెయ్యెత్తి అభివాదం చేసే వరకు అక్కడి నుంచి కదలరు.ఇక ఎప్పటిలాగే తాజాగా కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా సోమవారం కూడా ఇదే పరిస్థితి నెలకొంది.

 Rajinikanth Neighbor Fires Super Star Fans Sankranti-TeluguStop.com

తమిళనాడు చెన్నైలోని( Chennai in Tamil Nadu ) స్థానిక పోయెస్‌గార్డెన్‌లో( Poesgarden ) రజనీకాంత్‌ ఇంటి ముంగిట వేకువ జామునే అభిమానులు బారులు తీరారు.దీంతో యథావిధిగానే రజనీకాంత్‌ వారికి కనిపించి అభివాదం చేయడంతో అభిమానుల్లో ఆనందం వెల్లి విరిసింది.అందరికీ పొంగల్‌ శుభాకాంక్షలు తెలిపిన రజనీకాంత్‌ అందరూ ఆరోగ్యంగా, మనశ్శాంతిగా, సంతోషంగా ఉండాలని భగవంతుడిని కోరుకుంటున్నానని ఆన్నారు.నిబద్ధత, నిజాయితీతో నడుచుకుంటే జీవితం ప్రశాంతంగా, సంతోషంగా సాగుతుందని ఆయన అభిమానులకు సూచించారు.

ఇదిలా ఉంటే రజనీకాంత్‌ పక్కింటి ఒక వృద్ధ మహిళ తన అసహనాన్ని వ్యక్తం చేశారు.అక్కడ సెక్యూరిటీ, అభిమానులతో వాగ్వాదానికి దిగారు.అభిమానులు తలైవా తలైవా అంటూ అరుస్తూ తమవంటి స్థానికులను ఇబ్బంది పెడుతున్నారన్నారు.ఏం మీ ఇంటి ద్వారాలు తెరిచి వారిని లోనికి పిలిపించుకోవచ్చుగా అని అన్నారు.అదేవిధంగా అభిమానులను ఉద్దేశించి వీరంతా తమ ఇంటి ముందు నిలబడి ఇలా కేకలు వేస్తున్నారని, తాము ఇంటిపన్ను కడుతున్నామని అయినా తమకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదనను వ్యక్తం చేశారు.ఉదయాన్నే అదీ పండుగ రోజున వచ్చి ఇలా ఇబ్బందికి గురిచేస్తున్నారని, దేవున్ని కూడా ప్రార్థించలేకపోతున్నామని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube