టీవీ9 ఎఫెక్ట్‌.. అశోకవనంలో అర్జున కళ్యాణం పరిస్థితి ఏంటీ?

విశ్వక్ సేన్‌, రుక్సార్ ధిల్లాన్ జంటగా తెరకెక్కిన ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ విడుదలకు సిద్దం అయ్యింది.తెలంగాణ అబ్బాయి.

 Ashoka Vanamlo Arjuna Kalyanam Movie Promotion Goes Wrong , Ashoka Vanamlo Arj-TeluguStop.com

ఆంద్రా అమ్మాయి పెళ్లి కాన్సెప్ట్‌ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పై జనాల్లో ఇప్పటికే ఆసక్తి ఉంది.సినిమా ప్రారంభం సమయంలోనే మ్యారేజ్ బ్యూరో ఫామ్‌ ను విడుదల చేసి విశ్వక్‌ సేన్ ఫోటోతో ప్రమోషన్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.

 సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న సమయంలో టీజర్ మరియు ట్రైలర్ ను విడుదల చేసి సినిమాపై ఆసక్తి పెంచారు.తాజాగా సినిమాకు మరింతగా పబ్లిసిటీ చేయాలనే ఉద్దేశ్యంతో విశ్వక్ సేన్ తనకు తెలిసిన ఒక వ్యక్తితో ఫ్రాంక్‌ ప్లాన్‌ చేశాడు.

అది కాస్త డీవియేట్‌ అయ్యింది.ఫ్రాంక్‌ ను సరదాగా తీసుకోకుండా కొందరు వివాదంగా తీసుకోవడంతో తీవ్ర చర్చకు దారి తీసింది.

Telugu Ashokavanamlo, Rukshar Dhillon, Vishwak Sen-Movie

టీవీ9 లో ఆ ఫ్రాంక్ గురించి చర్చ జరుగుతున్న సమయంలో విశ్వక్‌ సేన్‌ అక్కడకు వెళ్లడం.అక్కడ యాంకర్ దేవి నాగవల్లితో గొడవ పడటం.ఆమె గేట్‌ ఔట్‌ మై స్టూడియో అంటూ అరవడంతో తీవ్ర చర్చకు దారి తీసింది.ఈ విషయంలో టీవీ9 విమర్శల పాలు అయ్యింది.అంతే కాకుండా అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ కూడా దక్కింది.రోడ్డు మీద విశ్వక్ సేన్ చేసిన ఫ్రాంక్‌ కంటే కూడా టీవీ 9 లో చేసిన హడావుడి వల్లే ఎక్కువగా పబ్లిసిటీ దక్కింది అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌.

ఈ వారంలో విడుదల కాబోతున్న సినిమాకు మంచి వసూళ్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశ్వక్సేన్ ఈ సినిమాతో సక్సెస్ ను  దక్కించుకుంటే ఆయన కెరియర్ మరోసారి జెట్ స్పీడ్ తో దూసుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube