నారా చంద్రబాబు నాయుడు.ఐటీను.
హైదరాబాద్ ను అభివృద్ది చేసిన ముఖ్యమంత్రిగా.చరిత్రలో నిలిచిపోతారు.
ఇక అదే తన అస్త్రంగా ఆయన ముందుకు దూసుకుపోతున్నారు.విషయం ఏమిటంటే.
హైదారాబాద్ లో మాదాపూర్ వంటి కాస్ట్లీ ప్రాంతాన్ని నిర్మించిన చంద్రబాబు.ఆయన సమయంలోనే అక్కడ హైటెక్స్ కన్వెన్షనల్ సెంటర్ కూడా కట్టారు.
ఇప్పుడు హైదరాబాద్ లో సెలబ్రెటీల ఫంక్షన్స్ ఏవైనా.వేదిక మాత్రం దాదాపుగా హైటెక్స్ ప్రాంగణమే.
అంతగా ఆదరణ పొందిందీ వేదిక.ఇక ఇప్పుడు అదే తరహాలో సీమాంధ్ర సిటీస్ పై దృష్టి సారించారు.
ప్రధాన నగరాలైన విశాఖ, తిరుపతి, విజయవాడల్లో హైటెక్స్ తరహాలో భారీగా కన్వెన్షన్ సెంటర్లు నిర్మించాలని నిర్ణయించారు.ఈ మేరకు బిడ్లకు నోటిఫికేషన్ కూడా ఇచ్చేశారు.
ఆసక్తి ఉన్న నిర్మాణ సంస్థలు మార్చి 17లోగా బిడ్లు దాఖలు చేయవచ్చని ఏపీ సర్కారు ప్రకటన విడుదల చేసింది.ఈ హైటెక్స్ తరహా నిర్మాణాలను ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తారు.
విశాఖ, తిరుపతి నగరాల్లో భారీగా నిర్మిస్తారట.అంటే కనీసం 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ నిర్మాణాలు ఉంటాయ.
దాదాపు 10 వేల మంది ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఫంక్షన్ కు హాజరయ్యేలా ఏర్పాట్లు ఉంటాయట.సమావేశ మందిరం, అక్కడే ప్రదర్శన కేంద్రాలు, ఫైవ్ స్టార్ హోటల్స్, షాపింగ్ మాల్స్, పార్క్, ఫుడ్ కోర్ట్స వంటి అన్ని ఆధునిక సౌకర్యాలు కల్పిస్తారట.
ఏది ఏమైనా అభివృద్ది చేయడంలో మా నాయకుడి తరువాతే ఎవరైనా అంటున్నారు టీడీపీ ఫ్యాన్స్.