సౌత్ సూపర్ బ్యూటీ అనుష్క శెట్టి త్వరలో పెళ్లిపీటలెక్కబోతుందా అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ సర్కిల్స్.ఎప్పటినుండో పెళ్లి పెళ్లి అంటున్నా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చిన అనుష్క త్వరలో పెళ్లి చేసుకోవడం ఖాయం అంటున్నారు.
అంతేకాదు అనుష్క పెళ్లి చేసుకునేది ఓ బడా నిర్మాతని అని తెలుస్తుంది.ఎన్నాళ్ల నుండో వారి మధ్య ప్రేమాయణం కొనసాగుతుందట.
అంతేకాదు ఆల్రెడీ పెళ్లైన ఆ నిర్మాత అనుష్కను రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడట.అయితే ఇలాంటి వార్తలపై అనుష్క స్పందించడం మానేసింది.
అప్పట్లో ఓ దర్శకుడితో ఎఫైర్ నడిపిస్తుందని.ఓ హీరోతో ఆల్రెడీ ఎంగేజ్ మెంట్ కూడా జరిగిందని రూమర్లు వచ్చాయి.
అయితే అవేవి నిజం కాలేదు.కాని ఇప్పుడు మాత్రం అనుష్క ఆ నిర్మాతను పెళ్లాడటం ఖాయం అంటున్నారట.
ఇప్పటికే సమంత చైతు పెళ్లితో టాలీవుడ్లో ఓ సంచలనం కాబోతుంటే అనుష్క నిర్మాత పెళ్లి కూడా అంతే క్రేజ్ తెచ్చుకుంది.మరి అనుష్క నిర్మాతల పెళ్లిలో నిజమెంత ఉందో కాని ఓ రెండు రోజులుగా మీడియా వాళ్లు స్వీటి పెళ్లి అంటూ హడావిడి చేసేస్తున్నారు.