వంట గ్యాస్ ధరలపై ట్రోలింగ్.. సిిలిండర్లకు ప్రధాని ఫొటో, పెరిగిన ధరలతో పోస్టర్లు

సెప్టెంబర్ 1న ఇండియన్ ఆయిల్ విడుదల చేసిన ధరల ప్రకారం రాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ (ఎల్‌పిజి కమర్షియల్ సిలిండర్ ధర) రూ.91.5 తగ్గింది.గతంలో రూ.1,976.50గా ఉన్న సిలిండర్ ఇప్పుడు దేశ రాజధానిలో రూ.1,885కు అందుబాటులో ఉంది.మేలో, 19 కిలోల సిలిండర్ ధర రూ.2,354 ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకుంది, అయితే ఇప్పుడు ఢిల్లీలో రూ.1,885గా ఉంది.కోల్‌కతా, ముంబై మరియు చెన్నా మూడు ముఖ్యమైన నగరాలు, ఇక్కడ వాణిజ్య LPG సిలిండర్ల ధర తగ్గింది.అయితే వంట గ్యాస్ ధరలు పెరగడంపై దేశవ్యాప్తంగా చాలా మంది వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు.

 Trs Takes A Dig At Nirmala Sitharaman With Pm Modi's Photo On Lpg Cylinders,lpg-TeluguStop.com

అలాంటి ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఇటీవల తెలంగాణలో బీజేపీ కేంద్ర పెద్దలు పర్యటిస్తున్నారు.

ముఖ్యంగా కేంద్ర మంత్రులు తరచూ వస్తున్నారు.టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.

తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా తెలంగాణలో పర్యటిస్తున్నారు.ఓ రేషన్ షాపు వద్దకు వెళ్లి రేషన్ బియ్యంలో కేంద్రం వాటా ఎంతని కలెక్టర్‌ను అడిగారు.

ఆయన చెప్పలేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.రేషన్ బియ్యంలో కేంద్రం వాటా ఉన్నప్పుడు ప్రధాని మోడీ ఫొటో ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు.

ప్రధాని మోడీ ఫొటోతో కూడిన ప్లెక్సీని పెట్టాలని ఆదేశించారు.ఈ తరుణంలో తెలంగాణలో టీఆర్ఎస్ నేతలు బీజేపీకి ఘాటు కౌంటర్లు ఇస్తున్నారు.

తాజాగా ఓ గ్యాస్ సిలిండర్ల ఆటోలో సిలిండర్లకు ప్రధాని మోడీ ఫొటోను అతికించారు.దానికి అదనంగా గ్యాస్ ఎంత ధర అనేది సూచిస్తూ, పోస్టర్ ఉంది.గ్యాస్ సిలిండర్ ధర రూ.1105గా పేర్కొన్నారు.గ్యాస్ ధర పెరగడానికి ప్రధాని మోడీ కారణమనే అభిప్రాయం కలిగేలా అది ఉంది.కేంద్ర పెద్దల విమర్శలకు ఇది కౌంటర్‌గా చెబుతున్నారు.

దీనిపై నెట్టింట ఆసక్తికర చర్చ కొనసాగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube