గుంటూరు కారం ట్రైలర్ నిన్న రిలీజ్ అయింది.అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ ని కూడా త్రివిక్రమ్( Trivikram ) తనదైన రీతిలో జనాల్లోకి తీసుకు వస్తు ఉంటాడు.
కానీ ఈ మధ్య గుంటూరు కారం( Guntur Karam Movie ) విషయంలో త్రివిక్రమ్ పట్టించుకోనట్లు కనిపిస్తున్నాడు.మరి ఆయన ఇంత నిర్లక్ష్యం వహించడానికి గల కారణం ఏంటి అనే వార్తలు కూడా వస్తున్నాయి.
నిజానికి త్రివిక్రమ్ అంటే ఇండస్ట్రీలో ఒక బ్రాండ్ ఆయన పేరు మీదనే చాలా సినిమాలు నడుస్తూ ఉంటాయి.అయితే ఇలాంటి సమయంలో త్రివిక్రమ్ ఎందుకు ఈ సినిమా విషయంలో అసలు పట్టించుమొనట్టు గా వ్యవహరిస్తున్నాడు అనే విషయాలు పట్ల అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి.
ఇక దీనికి కారణం మహేష్ బాబు( Mahesh Babu ) ఈ సినిమాలో ఎక్కువ ఇన్వాల్వ మెంట్ తీసుకోవడమే అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు… ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ఫ్యామిలీ డ్రామా( Family Drama ) తెరకెక్కుతుంది.కాబట్టి ఈ సినిమాలో కామెడీ గానీ కమర్షియల్ ఎలిమెంట్స్ గానీ పుష్కలంగా ఉన్నాయి.మరి ఈ సినిమాని ప్రేక్షకుడు ఎంతవరకు ఆదరిస్తారనేది కూడా తెలియాల్సి ఉంది.
అయితే త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఇంతకు ముందు వచ్చిన రెండు సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు కాబట్టి ఈ సినిమాతో భారీ బ్లాక్ బాస్టర్ హిట్ కొడతారని ఫ్యాన్స్ అందరూ మంచి ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందా లేదా అనేది చూడాలి.ఇక ఇప్పటివరకు త్రివిక్రమ్ కూడా మహేష్ బాబు కెరియర్ లో గుర్తుండి పోయే ఒక బ్లాక్ బస్టర్ హిట్ సినిమాని ఇస్తాను అని అంటున్నారు.
మరి రిలీజ్ అయితే గాని సినిమా ఎలా ఉంటుందో తెలియదు…
.