గుజరాత్ లోని వడదర ప్రాంతంలో ఈ మధ్యకాలంలో మొసళ్లు ఎక్కువగా ప్రత్యేక్షమవుతున్నాయి.ఇంకా ఈ నేపథ్యంలోనే ఇప్పుడు గుజరాత్‌లోని కేలన్‌పూర్‌లోని గ్రామ శివారు పంట పొలాల్లో మరోసారి మొసలి ప్రత్యేక్షం అయ్యింది.
దీంతో ఒక్కసారిగా స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు.
ఇంకా దీనిని చూసిన రైతులు షాక్ అయ్యి వెంటనే స్థానిక పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
మరికొందరు స్థానికులు దైర్యం చేసి ఆ మొసలిని తాళ్లతో బంధించారు.అనంతరం ఆ మొసలిని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.అయితే ఈ మోసలి ఏడు అడుగులు పొడవు ఉన్నట్టు అటవీ శాఖ అధికారులు తెలిపారు.
కాగా మొసలి పంట పొలాల్లో ఉందని సమాచారం అందుకున్న వెంటనే చేరుకుంటున్నట్టు జాతీయ న్యూస్ ఏజెన్సీకి అటవీ శాఖ అధికారులు వివరించారు.
కాగా స్థానికులు మొసలిని తాళ్లతో బంధించిన విషయంపై మాట్లాడుతూ.మొసళ్లను పట్టుకునే ముందు జాగ్రత్తగా ఉండాలని లేదంటే అవి మనుషులపై దాడికి పాల్పడుతాయని.వాటికీ రక్షిస్తున్నారని తెలియక అవి ఆత్మ రక్షణకు దాడికి దిగుతాయని వారు తెలిపారు.