యాదాద్రి భువనగిరి జిల్లా:జిల్లా నూతన కలెక్టర్ హనుమంతరావు ప్రభుత్వ వైద్యంపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.శుక్రవారం ఉదయం ఆలేరు, గుండాల పీ.
హెచ్.సిలను వరుసగా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు.
ఈ సందర్భంగా ఆస్పత్రిలోని రోగులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఆసుపత్రి రికార్డులను పరిశీలించి ఆస్పత్రి సిబ్బంది వివరాలను తెలుసుకున్నారు.
విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్న సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.సమయపాలన పాటించని వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు బాద్యతాయుతంగా వ్యవహారించాలని,విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పనవని హెచ్చరించారు.