లేడీ సూపర్ స్టార్ నయనతార జూన్ 9వ తేదీ దర్శకుడు విగ్నేష్ శివన్ ను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.మహాబలిపురంలో వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.
ఇక వీరి వివాహానికి పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.వివాహం తరువాత నూతన దంపతులు ముందుగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం పలు దర్శనాలకు వెళ్లారు.
ఈ విధంగా దైవ దర్శనాలు పూర్తి చేసుకున్న ఈ జంట హనీమూన్ కోసం థాయిలాండ్ వెళ్లారు.
ఇప్పటికే థాయిలాండ్ లో ఉన్నటువంటి వీరు హనీమూన్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
ప్రస్తుతం వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఇకపోతే నయనతార విగ్నేష్ ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.కానీ వీరి వివాహం కోసం ఈ జంట ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు.వీరి పెళ్లి వేడుకను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేయడంతో వీరి వివాహ ఖర్చును కూడా వీరే భరించారు.

ఇలా పెళ్లి కోసం ఖర్చు చేయని ఈ జంట హనీమూన్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది.థాయిలాండ్ లో హనీమూన్ కోసం వెళ్లిన ఈ దంపతులు లగ్జరీ హోటల్ లో బస చేశారు.ఇక ఈ ట్రిప్ తమ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా ఎంజాయ్ చేయాలని భావించారట అందుకే హనీమూన్ ట్రిప్ కోసం నయనతార దంపతులు ఏకంగా 2 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరి హనీమూన్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.







