పిల్లలు పుట్టకముందే వారికోసం బట్టలు కొంటున్న మహిళ.. నెటిజన్లు ఫిదా..?

మహిళలకు రీడింగ్, రైటింగ్, సినిమాలు చూడటం వంటి హాబీలు ఉంటాయి.కొందరికి మాత్రం చిత్ర విచిత్రమైన హాబీలు ఉంటాయి.

 Are Women Netizens Buying Clothes For Their Children Before They Are Born, Katie-TeluguStop.com

అలాంటి వారిలో కేటీ వుడ్‌ ఒకరు.టేనస్సీ రాష్ట్రంలోని ఛటానూగాకు చెందిన 32 ఏళ్ల న్యాయవాది కేటీ వుడ్‌కు ఒక వింతైన హాబీ ఉంది.

ఆమె భవిష్యత్తులో పుట్టబోయే పిల్లల కోసం ఇప్పుడే బేబీ దుస్తులు( Baby clothes ) కొంటుంది.ప్రస్తుతం గర్భవతి కానప్పటికీ, భాగస్వామి లేనప్పటికీ, కేటీ ఇప్పటికే 20కి పైగా బేబీ దుస్తులు, బూట్ల సెట్లను సేకరించింది.

ఆమె ఈ వస్తువులను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది, తేమ నుంచి రక్షించడానికి వాటిని సిలికా పౌచ్‌లలో నిల్వ చేస్తుంది.తాజాగా ఉంచడానికి వార్షికంగా వాటిని శుభ్రం చేస్తుంది.

కేటీ ( Katie )తన బావ, అక్క పిల్లలకు బట్టలు కొంటూ ఈ అలవాటును డెవలప్ చేసుకుంది.ఆ సమయంలో ఆమె బట్టలు చాలా తక్కువ ధరకు దొరుకుతాయని గమనించి, తన భవిష్యత్తు పిల్లల కోసం కూడా కొనడం మొదలుపెట్టింది.

కేటీకి భవిష్యత్తులో పిల్లలు పుడతారనే ఆశ ఉంది, ఈ అలవాటు ద్వారా డబ్బు కూడా ఆదా చేసుకోవచ్చని ఆలోచిస్తుంది.భవిష్యత్తులో భాగస్వామి దొరికితే, తన అభిరుచి గురించి చెప్పడానికి సిద్ధంగా ఉంది.

Telugu Baby, Chattanooga, Forward, Frugality, Katie Wood, Law School-Telugu NRI

చిన్నప్పటి నుంచే కేటీకి బట్టలు తక్కువ ధరకు కొనడం చాలా ఇష్టం.ఆమెకు 14 మంది అత్తలు, చాలా మంది బంధువులు ఉన్నారు.వారితో కలిసి తక్కువ ధరల్లో వస్తువులు కొనడం చాలా ఇష్టం.చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులతో కలిసి ‘గ్యారేజ్ సేల్స్’( Garage Sales ) కి వెళ్లడం వల్ల ఈ అలవాటు మరింత పెరిగింది.

అయితే, టీనేజ్ సమయంలో కొంతకాలం ఈ అలవాటు మాని, కొత్త ఫ్యాషన్ బట్టలు కొనడానికి ఇష్టపడేది.

Telugu Baby, Chattanooga, Forward, Frugality, Katie Wood, Law School-Telugu NRI

2010లో ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్శిటీలో( Florida International University ) లా స్కూల్‌లో చేరిన తర్వాత కేటీకి ఈ అలవాటు మళ్లీ మొదలైంది.బడ్జెట్‌లో ఉన్నప్పటికీ, మంచి నాణ్యత గల బట్టలు కొనడానికి ఈ అలవాటు ఆమెకు సహాయపడింది.బార్గెయిన్ లేదా బేరం ఆడటంలో ఆమె చాలా నైపుణ్యం కలిగి ఉంది.

ధర కంటే చాలా ఎక్కువ విలువైన వస్తువులను కనుగొనడంలో ఆమె చాలా చురుకుగా ఉంటుంది.ఉదాహరణకు, ఆమె రూ.300 కంటే తక్కువ ధరకు రూ.2,500 విలువైన బట్టలు కొన్నట్లు చెప్పుకుంటుంది.ఇలా చేయడం వల్ల ఆమె చాలా డబ్బు ఆదా చేసుకుంది.ఈ మహిళ అలవాటు, ఐడియాకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube