ఇది డిటెక్టివ్ సినిమా టైటిల్ కాదు.అపరాధ పరిశోధక నవల పేరు కాదు.
ముడపుల కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న టీటీడీపీ నాయకుడు రేవంత్ రెడ్డి పన్నెండు గంటలపాటు బెయిల్ దొరికింది.రేపు అంటే గురువారం ఆయన కూతరు నిశ్చితార్థం జరగబోతున్నది.
తండ్రిగా రేవంత్ ఆ కార్యక్రమానికి హాజరు కావల్సివుంది.సంప్రదాయం ప్రకారం ఆ కార్యక్రమంలో తండ్రి చేయాల్సిన పనులు ఉంటాయి గదా.దీంతో ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం రేవంత్ పన్నెండు గంటల బెయిల్ మంజూరు చేసింది.అంటే ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఆయన జైలు బయట ఉంటారు.
నిశ్చితార్థం కార్యక్రమంలో పాల్గొంటారు.ఈ కార్యక్రమంలో ఆనందంగా పాల్గొనాల్సిన రేవంత్ నిందితుడిగా ఉండి పాల్గొనాల్సిరావడం బాధాకరమే.
అయినా ఎవరూ చేసేదేమీ లేదు.కోట్ల రూపాయల అక్రమాస్తుల కేసులో నిందితుడైన వైఎస్ జగన్ చాలాకాలంగా బెయిల్‌పై కొనసాగుతుండగా, యాభై లక్షల ముడుపుల కేసులో నిందితుడైన రేవంత్ రెడ్డి అతి కష్టమ్మీద పన్నెండు గంటల బెయిల్ మాత్రమే సంపాదించుకోగలిగారు.
కోర్టు కేసులు, న్యాయస్థానాల నిర్ణయాలు చిత్ర విచిత్రంగా ఉంటాయి మరి.