పోలీసులు అరెస్టు చేసిన ఢిల్లీ న్యాయ శాఖ మంత్రి జితేందర్ సింగ్ తోమర్‌కు తాము అసలు లా డిగ్రీయే ప్రదానం చేయలేదని భాగల్పూర్‌లోని తిల్కా మాంఝీ విశ్వవిద్యాయలం వైఎస్ ఛాన్సలర్ ఆర్‌ఎస్ దూబే మరోసారి స్పష్టంగా చెప్నారు.మంత్రి లా డిగ్రీ నకిలీదని బయటపడినప్పుడే దాన్ని తాము ప్రదానం చేయలేదని ఈ విశ్వవిద్యాలయం తెలియచేసింది.
తోమర్‌కు లా డిగ్రీ ఎవరు ప్రదానం చేశారో నిగ్గు తేల్చాలని ఢిల్లీ కోర్టు పోలీసులను ఆదేశించిన నేపథ్యంలో తాము ప్రదానం చేయలేదని విశ్వవిద్యాలయం వీసీ మరోమారు తేల్చి చెప్పారు.ఈ విషయంలో తమ సిబ్బందిపై ఇప్పటివరకూ విచారణ జరపలేదని, అయితే దీనిపై ఇదివరకే కోర్టులో అఫిడవిట్ సమర్పించామని చెప్పారు.
విచారణకు వచ్చే పోలీసులకు పూర్తగా సహకరిస్తామన్నారు.అయితే విశ్వవిద్యాలయంలోని కొందరు అధికారుల సహకారం లేకుంగా తోమర్ నకిలీ లా డిగ్రీ సృష్టించడం సాధ్యం కాదని కొందరు అంటున్నారు.
దొంగ డిగ్రీ సంపాదించిన తోమర్ లాయర్‌గా ప్రాక్టీసు చేసుకునేందుకు బార్ కౌన్సిల్‌లో నమోదు చేయించుకున్నారు కూడా.అయితే ఆయన అధృష్టం పండిపోయి మంత్రి అయ్యారు.







