ఏపీ అధికార పార్టీ వైసిపి( YCP ) ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న సామాజిక సాధికార బస్సు యాత్ర( Samajika Sadhikara Bus Yatra ) నేటి నుంచి ప్రారంభం కానుంది.రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా లో ఏకకాలంలో ఈ యాత్ర చేపట్టనున్నారు.
ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం , గుంటూరు జిల్లా తెనాలి, అనంతపురం జిల్లా సింగనమల నుంచి ఈ బస్సు యాత్రలు ప్రారంభం అవుతాయి.ఆయా ప్రాంతాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు సామాజిక వర్గాల కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు, డైరెక్టర్లు , పార్టీ నేతలు పాల్గొంటారు.
ప్రతిరోజు మధ్యాహ్నం నుంచి బస్సు యాత్ర షెడ్యూల్ ప్రారంభమవుతుంది.
మధ్యాహ్నం ఎంపిక చేసిన ప్రాంతంలో 200 మంది పార్టీ నేతలు ఒకచోట సమావేశమై సామూహిక భోజనాలు చేస్తారు.
అనంతరం మీడియా సమావేశం నిర్వహించనున్నారు .అక్కడ నుంచి నిర్దేశించుకున్న రూట్ మ్యాప్ లో సామాజిక బస్సు యాత్ర ప్రారంభమవుతుంది.ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంలో బీసీ, ఎస్సీ , ఎస్టీ మైనారిటీ వర్గాలకు అందించిన సంక్షేమ ప్రయోజనాలు, రాజకీయ సాధికారిక , ఆయా వర్గాల్లో వచ్చిన సామాజిక ఆర్థిక రాజకీయ పురోగతిని వివరించనున్నారు.సాయంత్రం బహిరంగ సభను నిర్వహిస్తారు .ఇదే విధంగా ప్రతిరోజు రాష్ట్రంలోనూ మూడు ప్రాంతాల్లో మూడు బహిరంగ సభలను నిర్వహిస్తారు.సామాజిక బస్సు యాత్ర మూడు దశల్లో జరుగుతుది.
మొదటి దశ నవంబర్ 9 వరకు కొనసాగుతుంది.

షెడ్యూల్ ఇలా…
గురువారం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం,( Ichchapuram ) గుంటూరు జిల్లా తెనాలి( Tenali ) అనంతపురం జిల్లా సింగనమల.
ఈనెల 27న గజపతినగరం నరసాపురం తిరుపతి.
ఈనెల 28న భీమిలి , చీరాల, ప్రొద్దుటూరు
ఈనెల 30న పాడేరు,( Paderu ) దెందులూరు , ఉదయగిరి
31న క్యాబినెట్ భేటీ కారణంగా యాత్రకు బ్రేక్ ఇవ్వనున్నారు.
నవంబర్ 1న పార్వతీపురం , కొత్తపేట, కనిగిరి
నవంబర్ 2న మాడుగుల , అవనిగడ్డ, చిత్తూరు

నవంబర్ 3న నరసన్నపేట , కాకినాడ రూరల్, శ్రీకాళహస్తి
నవంబర్ 4న శృంగవరపుకోట , గుంటూరు ఈస్ట్, ధర్మవరం
నవంబర్ 6న గాజువాక , రాజమండ్రి రూరల్, మార్కాపురం
నవంబర్ 7న రాజాం, వినుకొండ ,ఆళ్లగడ్డ
నవంబర్ 8న సాలూరు, పాలకొల్లు ,నెల్లూరు రూరల్
నవంబర్ 9న అనకాపల్లి, పామర్రు, తంబళ్లపల్లె
ఈ విధంగా డిసెంబర్ 31 వరకు మొత్తం 60 రోజులు పాటు ఈ యాత్ర రాష్ట్రమంతా జరగనుంది.







