నల్లగొండ జిల్లా:గుర్రంపోడు మండలం బోడపాడు గ్రామానికి చెందిన జానపాటి నగేశ్ దేశంలోని వివిధ రాష్ట్రాల పర్యటనలు చేసి అరుదైన రికార్డులను సొంతం చేసుకున్నాడు.22 ఏళ్ల వయసులో ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా దేశంలోని 12 రాష్ట్రాలలో పర్యటించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, అనంతరం 23 సంవత్సరాల వయసులో దేశంలోని 14 రాష్ట్రాలలో పర్యటించి ఇంటర్నేషనల్ రికార్డ్స్ లో స్థానం సంపాదించాడు.సొంత వాహనం లేకుండా కేవలం ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా దేశంలోని వివిధ రాష్ట్రాలలో పర్యటించి అక్కడి ప్రజల జీవన విధానం,అక్షరాస్యత, విద్య,వైద్యం,ఆహారపు అలవాట్లు,సంస్కృతి సాంప్రదాయాలను గురించి అధ్యయనం చేయడానికి 2019 నుండి దేశంలోని కేరళ,రాజస్థాన్,హర్యానా, గోవా,పంజాబ్,ఉత్తర ప్రదేశ్,చండీగఢ్,ఢిల్లీ, తమిళనాడు,కర్ణాటక,ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలలో పర్యటించాడు.ఇంటర్నేషనల్ రికార్డ్స్ సాధించడంతో గ్రామస్తులు అభినందనలు తెలుపుతున్నారు.




Latest Nalgonda News