తండాలో తరుచూ అగ్ని ప్రమాదాలు…మంత్రాలని గిరిజనుల భయాందోళన

నల్లగొండ జిల్లా:మిర్యాలగూడ మండలం( Miryalaguda Mandal) కురియాతండాలో గత కొన్ని నెలలుగా నిత్యం అగ్ని ప్రమాదాలు సంభవిస్తూ గడ్డి వాములు,గుడిసెలు దగ్ధమవుతున్న నేపథ్యంలో గ్రామస్తులు ఇదేదో మంత్రతంత్రాలని భయందోళనకు గురి అవుతున్నారన్న విషయం తెలుసుకున్న జానవిజ్ఞాన వేదిక ప్రజా పౌర సంఘాల ప్రతినిధులు డాక్టర్ రాజు,కోలా శ్రీనివాస్,కస్తూరి ప్రభాకర్ తండాకు చేరుకొని,అగ్ని ప్రమాదాలపై ప్రజల్లో నెలకొన్న మూఢ నమ్మకాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా వారు ప్రజలతో మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందవద్దని,మంత్ర తంత్రాలను నమ్మి ఆర్థికంగా,మానసికంగా నష్టపోవద్దని,తగునివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు.

మూఢనమ్మకాల నిర్ములనకై అవగాహనా కార్యక్రమాలు చేస్తామన్నారు.అనంతరం గ్రామ మాజీ సర్పంచ్ ధనవత్ సూర్య,మాజీ ఉప సర్పంచ్ ధనవత్ థావు మాట్లడుతూ మధ్యాహ్న సమయంలో నంద్యా,సోమ్లా, విజేందర్ లకు సంబంధించిన 500 గడ్డి కట్టలు కాలిపోయాయని,ఆ కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు,మహిళలు గ్రామం పెద్దలు పాల్గొన్నారు.

వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబో లో వచ్చే సినిమా ఎలా ఉండబోతుంది..?