నేటి తరం యువతకు కేవలం మాటల కన్నా కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు ఎలివేషన్ సీన్స్ అంటేనే ఇష్టం.కానీ ఒకప్పుడు సినిమాకు కథ ఎంత ముఖ్యమో మాటలు అంతే ప్రాణం.
అలంటి మాటలను పోగేసి అందమైన సినిమాలను మలిచేవారు నాటి రోజుల్లో.ఇక తన అద్భుతమైన మాటలతో ఎన్నో హిట్ సినిమాలకు పని చేసిన రచయిత సత్యానంద్.
కృష్ణ హీరోగా నటించిన మాయదారి మల్లిగాడు సినిమాకు తొలిసారి మాటలు అందించాడు.ఈ చిత్రానికి ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం చేపట్టారు.
ఆదుర్తి సుబ్బారావు మేనల్లుడే ఈ సత్యానంద్.మాయదారి మల్లిగాడు సినిమాకు మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాడు.
అతడికి రచనలో ఇంట్రెస్ట్ ఉన్నట్టు కనిపెట్టిన ఆదుర్తి ఒక కథ ఇచ్చి స్క్రిప్ట్ మొత్తం రాయమని చెప్పగా ఏకంగా సత్యానంద్ ఆ కథను నవలగా రాసాడు, అది మెచ్చిన ఆదుర్తి మాటల రచయితగా మొదటి సారి అవకాశం ఇచ్చాడు.అక్కడ మొదలైన సత్యానంద్ మాటల ప్రయాణం నిన్న మొన్నటి చిరంజీవి సైరా నరసింహ రెడ్డి సినిమా వరకు కొనసాగింది.
ఇక అయన ఎంతో మంది హీరోలతో కలిసి పని చేసాడు.ఎన్టీఆర్, అక్కినేని , కృష్ణ, నుంచి బాలయ్య, చిరు, వెంకటేష్ వరకు అందరితో పని చేయడం విశేషం.ప్రస్తుతం డెబ్భై ఏళ్ళ వయసులోనే ఏంటో అద్భుతంగా అయన కలం పట్టి మాటలు రాయడం మాములు విషయం కాదు.
ఇక అయన సినిమాల్లో ఒక గమ్మత్తయిన విషయం ఉంది.అక్కినేని కుటుంబం లో మూడు తారలతో పని చేసారు.అక్కినేని నాగేశ్వర రావు, ఆ తర్వాత నాగార్జున, నాగ చైతన్య సినిమాలకు మాత్రలు రాసారు.
అలాగే నందమూరి ఫ్యామిలి లో సైతం మూడు తారలతో పని చేసిన అనుభవం సత్యానంద్ సొంతం.మొదట ఎన్టీఆర్, ఆ తర్వాత బాలయ్య, చివరగా తారక్ సినిమాకు పని చేసాడు.
ఇక కృష్ణ మరియు మహేష్ బాబు సినిమాలకు కూడా పని చేసారు.ఒక సందర్భంలో బాలయ్య బాబు మోక్షజ్ఞ తో చెప్పారట.ఈ మహానుభావుడు మన తాతయ్యకు , నాకు పని చేసారు అయన కళ్ళకు దండం పెట్టమని చెప్పగానే మోక్షజ్ఞ పాదనమస్కారం చేశారట, ఇక ఎదో ఒక రోజు మోక్షజ్ఞ కు సైతం పని చేయాలనీ బాలయ్య బాబు కోరారట.