ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది.దీనితో టాలీవుడ్ లో స్టార్ హీరోలు అలాగే దర్శక నిర్మాతలు ప్రతి ఒక్కరు కూడా పాన్ ఇండియా సినిమాలపైనే ఆసక్తిని చూపిస్తున్నారు.
అలాగే ప్రతి ఒక్కరూ కూడా మల్టీ లాంగ్వేజలలో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ మార్కెట్ ను విస్తరించుకొని ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పాపులారిటి తెచ్చుకోవడానికి ఆరాటపడుతున్నారు.అయితే చాలామంది నిర్మాతలకు భారీగా ఆర్థిక ఇబ్బందులను తెచ్చిపెడుతోంది.
ఇది ఇలా ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక యంగ్ హీరో దశాబ్దకాల క్రితమే సినీ ఇండస్ట్రీకి ఎంట్రి ఇచ్చినప్పటికీ, కెరీర్ ఆరంభంలో రెండు హిట్ సినిమాలు అందుకొని వాటితోనే ఇన్నేళ్లపాటు నెట్టుకొస్తున్నాడు.
హీరోగా ఇండస్ట్రీలో నిలుదొక్కు కొనే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఏవీ సక్సెస్ కావడం లేదు.
బ్లాక్ బస్టర్ సినిమా అనేది ఆ యంగ్ హీరోకి కలగానే మిగిలిపోనుంది.అయితే సినిమా మీద ఆ హీరోకి ఉన్న ఫ్యాషన్ తో ఇండస్ట్రీలో పరిచయాలు కారణంగా అవకాశాలు మాత్రం బాగానే అందుకుంటున్నాడు.
ఈ క్రమంలోనే తాజాగా ఆ యంగ్ హీరోతో పాన్ ఇండియా సినిమా చేయడానికి దర్శక నిర్మాతలు ముందుకు వచ్చారు.పాన్ ఇండియా రేంజ్ లో ఆ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.
ఇందులో స్టార్ క్యాస్టింగ్ టాప్ టెక్నిషియన్స్ ను ఇందులో భాగం చేశారు.ఇప్పటికే మెజారిటీ పార్ట్ షూటింగ్ పూర్తి చేయగా అందుకోసం బాగానే ఖర్చు అయినట్లు తెలుస్తోంది.

దీంతో నిర్మాతకు ఆర్థిక ఇబ్బందులు వచ్చాయని వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ కి దాదాపు 35 కోట్లు ఖర్చు అయిందని, ఇంకా సినిమా పూర్తి చేయడానికి 6 కోట్ల దాకా అవసరం అవుతుంది.అంటే మూవీ కంప్లీట్ అవడానికి 41 కోట్లు ఖర్చయినట్లే.కానీ అంతగా మార్కెట్ లేని సీ క్యాటగిరీ హీరోతో అంత పెట్టుబడి వెనక్కి రాబట్టడం కష్టమే అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ ట్రేడ్ మ్యాథ్స్ అన్నీ ఆలోచించుకొని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆ నిర్మాతకు సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని ఏ ఫైనాన్షియర్ కూడా సాయం అందించడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి.