కాళీ పోస్టర్ వివాదం బెంగాల్ లోని అధికార పార్టీ టీఎంసీని తాకింది.టీఎంసీ ఎంపీ మహూవ మొయిత్రా కాళీ మాతనుద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అగ్నికి ఆజ్యం పోసినట్టయింది.
ఆమె వ్యాఖ్యలపై బెంగాల్ లోని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.మొయిత్రాను అరెస్ట్ చేయాలని మమత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
టీఎంసీని హిందూ వ్యతిరేక పార్టీ అని బీజేపీ నేతలు విమర్శించారు.
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహూవ మొయిత్రా పై బీజేపీ నేత ఫిర్యాదు మేరకు ఓ కేసు నమోదైంది.
ఆమె కాళీ మాతను కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడం ద్వారా హిందువుల మనోభావాలను గాయపరిచారని ఛటర్జీ తన ఫిర్యాదులో తెలిపారు.దాంతో మొయిత్రాపై ఎఫ్ఐఆర్ నమోదైంది.కేసుపై మొయిత్రా స్పందిస్తూ, బీజేపీతో తేల్చుకుంటానంటూ వ్యాఖ్యానించారు.
కోల్‌కతాలో నిర్వహించిన కార్యక్రమంలో మొయిత్రా మాట్లాడుతూ… దేవుళ్లను ఎవరికి నచ్చిన పద్ధతిలో వారు ప్రార్థన చేసుకునే హక్కు ఉన్నదన్నారు.
కాళీ మాతను తాను మాంస భక్షకిగా, మద్యపానాన్ని సేవించే వ్యక్తిగా పూజించే హక్కు తనకు ఉన్నదన్నారు.మీ దేవతను శాకాహారిగా, తెల్ల దుస్తులు ధరిస్తారని ఊహించుకోవడానికి మీకు హక్కు ఉన్నట్లుగానే… నాకు కూడా నా దేవత మాంసం తింటారని ఊహించుకునే స్వేచ్ఛ ఉన్నదన్నారు.
ఈ వ్యాఖ్యలతో బీజేపీ ఫైర్ అయింది.హిందూ దేవీదేవతలపై కించపరిచేలా మాట్లాడటం ఏంటని ప్రశ్నల వర్షం కురిపించాయి.బీజేపీకి హిందూ సంఘాలు మద్దతు తెలపడంతో.బీజేపీ బెంగాల్ రాజధానిలో ర్యాలీకి పిలుపునిచ్చింది.
టీఎంసీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్టు అయ్యాయి.ఎంపీ మహుమా మొయిత్రీ చేసిన వ్యాఖ్యలు ఒక్క బెంగాల్ లోనే కాకుండా.దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి.కాళీ డాక్యూమెంట్రీకు ఎంపీ మద్దతు ప్రకటించడంతో.
ఈవివాదం ఇంకా ముదిరింది.ఎంపీ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ కలకత్తాలో భారీ ర్యాలీ చేపట్టింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే సువేందు అధికారి సమక్షంలో బీజేపీ జెండాలతో.ఈ ర్యాలీ జరిగింది.
ఇంతకాలం సైలెంట్ గా ఉన్న బెంగాల్ రాజకీయాలు.ఎంపీ వ్యాఖ్యలతో ఒక్క సారిగా వేడెక్కాయి.
హిందూ దేవీ దేవతలపై జరుగుతున్న దాడులకు తోడు.హిందువులపై కూడా దాడులు పెరుగుతుండటంతో.
హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

గతంలో కూడా టీఎంసీ నేతలు ఇదే విధంగా చేశారని బీజేపీ నేత రథీంద్ర బోస్ అన్నారు.ఓట్ల కోసం హిందువుల మనోభావాలను గాయపరచడం టీఎంసీ అధికారిక వైఖరి అని తాము భావిస్తున్నామన్నారు.ఇంకో వైపు టీఎంసీ దిద్దుబాటు చర్యలకు దిగింది.
మొయిత్రా వ్యాఖ్యలను టీఎంసీ ఖండించింది.ఆమె తన వ్యక్తిగత హోదాలోనే ఈ వ్యాఖ్యలు చేశారని తెలిపింది.
ఆమె చేసిన వ్యాఖ్యలను తాము సమర్థించడం లేదని వివరణ ఇచ్చింది.అయితే హిందూ సంఘాలు కానీ, బీజేపీ కానీ ఆమె వ్యాఖ్యలపై వెనక్కి తగ్గడం లేదు.







