ప్రస్తుత సమాజంలో మనిషి ప్రాణానికి విలువ అనేది లేకుండా పోతుంది.మంచి, మానవత్వం లేకుండా కారణం ఏదైనా మనిషి ప్రాణాలు తీయడానికే లక్ష్యంగా పెట్టుకోని దారుణ హత్యలకు పాల్పడే వ్యక్తుల మధ్య మనం జీవనం సాగిస్తున్నాము.
ఇలాంటి కోవలోనే ఓ మహిళ అత్యంత దారుణ హత్యకు గురైన ఘటన నిజామాబాద్ జిల్లాలో( Nizamabad ) చోటు చేసుకుంది.అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.
వివరాల్లోకెళితే.నిజామాబాద్ లోని ఖలీల్ వాడి లోని నాందేవ్ వాడలో బుక్యా లలిత (50)( Bukya Lalitha ) నివాసం ఉంటోంది.లలిత స్వస్థలం బోధన్ మండలం బెల్లాల్ గ్రామం. అయితే ఏడాది నుండి నగరంలోని ఓ ప్రజాప్రతినిధి ఇంట్లో పని చేస్తూ.నాందేవ్ వాడలో బుక్యా లలిత ఒంటరిగా జీవిస్తోంది.అయితే గత రెండు రోజులుగా కూతురు ( Lalitha Daughter ) ఎన్నిసార్లు ఫోన్ చేసినా లలిత ఫోన్ తీయకపోవడంతో.
ఆమె కూతురికి అనుమానం వచ్చి సోమవారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా తాళం వేసి ఉంది.దీంతో ఆమె కూతురు ఏం చేయాలో.
మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది.
పోలీసులు ( Police ) ఆమెతో కలిసి ఇంటికి వెళ్లి.ఇంటి తలుపులు పగలగొట్టి చూస్తే.ఇంట్లో లలిత మృతదేహం నగ్నంగా ఉంది.
లలిత మృతదేహాన్ని చూసిన ఆమె కూతురు ఒక్కసారిగా షాక్ అయింది.లలిత చనిపోయి రెండు రోజులు అయ్యి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
అయితే మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని అధికారులు చెబుతున్నారు.శనివారం ఆమె ఎవరితోనో కలిసి ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సహాయం తో ఆధారాలు సేకరించిన పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కిరణ్ కుమార్ తెలిపారు.