దెబ్బకు దెబ్బ: ట్రంప్‌పై ప్రతీకారం తీర్చుకున్న గ్రెటా థన్‌బర్గ్

పర్యావరణ పరిరక్షణ కోసం గళమెత్తిన స్వీడన్ బాలిక గ్రెటా థన్‌బర్గ్ గురించి అందరికీ తెలిసిందే.కొన్నేళ్లుగా పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడుతున్న ఈమె గతేడాది స్వీడన్ పార్లమెంట్ ముందు ఒంటరిగా ధర్నాకు దిగి సంచలనం సృష్టించింది.

 chill, Donald, Chill: Greta Thunberg Trolls Trump With His Own Words Greta Thun-TeluguStop.com

ఈ చర్యతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఈ అమ్మాయి.తదనంతర కాలంలో అనేక అంతర్జాతీయ వేదికలపై ప్రసంగించింది.

వాతావరణ మార్పులకు ప్రపంచ దేశాలను పరిపాలిస్తున్న నాయకులే కారణమంటూ ఐక్యరాజ్యసమితిలో నిప్పులు చెరిగింది.ఈ క్రమంలో ప్రఖ్యాత టైమ్స్ మ్యాగజైన్ ‘‘ 2019 పర్సన్ ఆఫ్ ది ఇయర్‌’’గా గ్రేటా థెన్‌బర్గ్‌ని ప్రకటించింది.

దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ ‘చాలా హాస్యాస్పదం.గ్రెటా తన యాంగర్ మేనేజ్‌మెంట్ సమస్యపై తప్పక వర్క్ చేయాలి.అటు తర్వాత తన ఫ్రెండ్‌తో కలిసి పాత ఫ్యాషనైడ్ మూవీకి వెళ్ళండి! చిల్ గ్రెటా, చిల్’ అంటూ ట్వీట్ చేశారు.దీనిపై అప్పటికప్పుడే ట్విట్టర్ లో తన బయోడేటాను మార్చేశారు గ్రెటా.

ప్రస్తుతం తాను కోపాన్ని కంట్రోల్ లో ఉంచుకోవడంపై దృష్టి సారించిన టీనేజర్ నని, ప్రస్తుతం ఒక ఫ్రెండ్‌ తో కలిసి సినిమా చూస్తూ ఆనందిస్తున్నానని వ్యాఖ్యానించారు.అయితే ఈ పంచ్ ట్రంప్‌కి సరిపోదని భావించిన గ్రెటా సమయం కోసం 11 నెలలు వేచి చూశారు.

ప్రస్తుతం అమెరికా ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న విషయం తెలిసిందే.ట్రెండ్‌ను బట్టి చూస్తే అగ్రరాజ్య పీఠంపై ఈ సారి జో బిడెన్ కూర్చునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఓటమిని తట్టుకోలేకపోతున్న ట్రంప్.పలు రాష్ట్రాల్లోని ఎన్నికల ఫలితాలపై తన మద్ధతుదారులతో పిటిషన్లు వేయించాడు.

కోర్టులు ట్రంప్ పిటిషన్లు కొట్టేస్తున్నాయి.దీంతో డొనాల్డ్ ట్రంప్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి ఇదే మంచి సమయమని భావించిన గ్రెటా… ఆయన వాడిన పదాలతోనే రివర్స్ పంచ్ ఇచ్చింది.“చాలా హాస్యాస్పదం.డొనాల్డ్ యాంగర్ మేనేజ్‌మెంట్ సమస్యపై దృష్టి పెట్టాలి.

ఇందుకోసం స్నేహితుడితో కలిసి ఏదైనా మంచి పాత ఫ్యాషన్‌ సినిమాకు వెళ్లండి! చిల్, డొనాల్డ్, చిల్!” అంటూ థన్‌బర్గ్ ట్వీట్ చేశారు.దీంతో ఇప్పటికే సోషల్‌ మీడియాలో ట్రంప్‌ను భారీగా ట్రోల్‌ చేస్తున్ననెటిజన్లు గ్రెటా ట్వీట్‌తో మరింత హంగామా చేస్తున్నారు.

blockquote class="twitter-tweet">

So ridiculous. Donald must work on his Anger Management problem, then go to a good old fashioned movie with a friend! Chill Donald, Chill! https://t.co/4RNVBqRYBA

— Greta Thunberg (@GretaThunberg) November 5, 2020

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube