తల్లి అంటే ఓ మహాశక్తి.ఈ ప్రపంచాన్ని పరిచయం చేసేది తల్లి.ప్రపంచంలో బతకడానికి కావాల్సిన ధైర్యాన్నిచ్చేది అమ్మ.అటువంటి తల్లిని హత్య చేసి ఆమె రక్తం పిల్లలు ఆడుకున్న ఘటన ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది.తమిళనాడు రాష్ట్రంలోని తిరునల్వేలి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.తల్లిని హత్య చేసిన మతిస్థిమితం లేని కూతళ్లను చూసి పోలీసులే షాక్ అయ్యారు.
పోలీసులు ఆ కూతుళ్లకు బర్గర్ కొనివ్వటంతో తమ తల్లి హత్య తామే చేసినట్లు ఆ ఇద్దరు కూతుళ్లు ఒప్పుకున్నారు.తల్లిని హత్య చేసిన తర్వాత రక్తపు మడుగుల్లో పడి ఉన్న తల్లి శవం పక్కనే కూర్చుని పైశాచిక ఆనందాన్ని పొందారు.
వారిద్దరు తమ బొమ్మలకు తమ తల్లి రక్తం పూస్తూ ఆడుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో పాళయంకోటైకి చెందిన విశ్రాంత రైల్వే ఉద్యోగి కోయిల్‌పిచ్చై, ఉషా అనే భార్యాభర్తలకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.నీనా(21), రీనా(19) కూతుళ్లు తల్లిదండ్రులతో బాగానే ఉండేవారు.అయితే ఆ భార్యభర్తల మధ్య గొడవలు వచ్చాయి.
దీంతో వారిద్దరూ విడిపోయి జీవనం సాగిస్తున్నారు.కోయిల్‌పిచ్చై మున్నీర్‌పల్లంలోకి వెళ్లి దూరంగా బతుకుతున్నాడు.
ఆ తర్వాత తమ కూతుళ్లు నీనా, రీనా ఇంజినీరింగ్ చదివి విద్యను పూర్తి చేశారు.ఉషా స్కూలు పిల్లలకు ట్యూషన్ చెప్పుకుంటూ బతుకుతోంది.

ఇదిలా ఉండగా మంగళవారం సాయంత్రం ట్యూషన్ కోసం వచ్చిన పిల్లలు తలుపు వేసి ఉండటంతో ఏమైందోనని టెన్షన్ పడ్డారు.ఎవరూ లేకపోవడంతో ఊరికేమైనా వెళ్లారేమోనని మొదట అనుకున్నప్పటికీ ఆ తర్వాత తలుపు గడియ మాత్రం పెట్టి ఉండటంతో కిటికీలోంచి లోపలికి చూశారు.అంతే వారు లోపల జరిగిన దానిని చూసి షాక్ అయ్యారు.ఉషా రక్తపు మడుగుల్లో పడిపోయి ఉంది.ఆమె పక్కనే ఇద్దరు పిల్లలు కూర్చుని ఆడుకుంటూ ఉండటం స్తానికంగా కలకలం రేపింది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మతిస్థిమితం లేని ఇద్దరు కూతుళ్లను అదుపులోకి తీసుకున్నారు.
కేసును విచారిస్తున్నారు.