రష్యా( Russia ) ఉక్రెయిన్ లోని ‘బాగపుత్’ నగరాన్ని పూర్తిగా ధ్వంసం చేసి స్వాధీన పరుచుకుంది.ఉక్రెయిన్ తో( Ukraine ) యుద్ధం ప్రారంభమైన తర్వాత ఈ నగరాన్ని స్వాధీనం చేసుకోవడానికి రష్యా తీవ్రంగా ప్రతిఘటించాల్సి వచ్చింది.
ఈ క్రమంలో రష్యా దాదాపు 20,000 మంది సైనికుల్ని కోల్పోయినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.ఉక్రెయిన్ అంతకంటే ఎక్కువ మంది సైనికులని కోల్పోవలసి వచ్చింది.
కాగా బాగపుత్ నగరం ఎంతో విశిష్టత కలిగినది.దీనికి గులాబీ నగరం అనే పేరు కూడా వుంది.
ఎందుకంటే ఇక్కడ గులాబీ తోటలు వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు.
అయితే నేడు అవన్నీ ధ్వంసం అయిపోయాయి.కాగా బాగపుత్ పుర నేటి చిత్రాలను అమెరికా ( America ) వీడియోల రూపంలో బట్టబయలు చేసింది.దీనిపై రష్యా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
ప్రస్తుతం హిరోషిమాలో జీ7 సదస్సు జరుగుతుంది.జపాన్లోని హీరోషిమా పై గతంలో అమెరికా అణు బాంబు ప్రయోగించి, దీని ద్వారా అక్కడ కొన్ని ఏళ్ల పాటు జీవజాలం బతకడానికి వీలులేకుండా చేసింది.
ఇపుడు ఇదే విషయాన్ని చూపెడుతూ రష్యా అమెరికాని విమర్శిస్తోంది.మీలాంటివారికి మమ్మల్ని గురించి విమర్శలు చేసే హక్కులేదంటూ తెగేసి చెప్పింది.
అవును, అమెరికా చేస్తే ఒప్పు… రష్యా చేస్తే తప్ప? అని ఎదురు ప్రశ్నించింది.అమెరికా చేసిన అణు దాడి వల్ల జపాన్లోని హిరోషిమా నాగసాకి ప్రాంతాలు ఎంత మేర దెబ్బతిన్నాయో ప్రపంచ వ్యాప్తంగా తెలిసిన విషయమే.ఇప్పుడు ఏమి ఎరుగన్నట్టు అమెరికా మాట్లాడడం చూస్తుంటే చిత్రంగా ఉందని రష్యా ఎదురు సమాధానం చెప్పింది.ప్రస్తుతం అమెరికా రష్యా 2 దేశాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
బాగపుత్ నగరం తీవ్రంగా దెబ్బ తినడంతో ఉక్రెయిన్, అమెరికా రష్యాపై ఆగ్రహంతో రగిలిపోతున్నాయి.ఇలాంటి సందర్భంలో జి7 దేశాల సదస్సును వేదికగా చేసుకుని ప్రపంచ వ్యాప్తంగా రష్యా పై వ్యతిరేకత తీసుకురావాలని అమెరికా భావిస్తుంది.