జుట్టును బ‌లంగా మార్చే హెయిర్ స్ప్రే.. త‌ప్ప‌కుండా ట్రై చేయండి!

జుట్టు ఎప్పుడైతే బ‌ల‌హీనంగా మారుతుందో.అప్పుడే హెయిర్ ఫాల్, హెయిర్ బ్రేకేజ్‌, స్ల్పిట్ ఎండ్స్ వంటి స‌మ‌స్యలు అధికంగా వేధిస్తుంటాయి.

 Best Hair Spray For Strong Hair!  Hair Spray, Strong Hair, Hair Care, Hair Care-TeluguStop.com

అందుకే కేశాల‌ను దృఢ‌ప‌రుచుకోవ‌డం ఎంతో అవ‌స‌రం.అందు కోసం పోష‌కాహారాన్ని డైట్‌లో చేర్చుకోవ‌డంతో పాటు.

కొన్ని కొన్ని ఇంటి చిట్కాల‌ను సైతం పాటించాలి.ముఖ్యంగా ఇప్పుడు చెప్ప‌బోయే హెయిర్ స్ప్రేను గ‌నుక యూజ్ చేస్తే.

జుట్టు అద్భుతంగా బల‌ప‌డుతుంది.మ‌రి ఆ హెయిర్ స్ప్రేను ఎలా త‌యారు చేసుకోవాలి.? మ‌రియు ఏ విధంగా వాడాలి.? వంటి విష‌యాల‌పై లేట్ చేయ‌కుండా కింద‌కు ఓ లుక్కేసేయండి.

ముందుగా ఒక పెద్ద క్యారెట్ తీసుకుని పీల్ తొల‌గించి వాట‌ర్‌లో క‌డిగి చిన్న చిన్న ముక్కలుగా క‌ట్ చేసుకోవాలి.ఈ ముక్క‌ల‌ను మిక్సీ జార్‌లో వేసి వాట‌ర్ సాయంతో మెత్త‌టి పేస్ట్‌ను త‌యారు చేసుకోవాలి.

ఆ త‌ర్వాత క్యారెట్ పేస్ట్ నుంచి జ్యూస్‌ను వేరు చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో క్యారెట్ జ్యూస్‌, వ‌న్ టేబుల్ స్పూన్ కొకొన‌ట్ ఆయిల్‌, వ‌న్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్‌, వ‌న్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఆపై ఈ క్యారెట్ వాట‌ర్‌ను ఒక స్ప్రే బాటిల్‌లో నింపుకుంటే హెయిర్ స్ప్రే సిద్ధ‌మైన‌ట్టే.దీనిని ఎలా వాడాలంటే.మొద‌ట జుట్టుకు ఎటువంటి ఆయిల్ లేకుండా చూసుకోవాలి.ఆ త‌ర్వాత త‌యారు చేసుకున్న హెయిర్ స్ప్రేను జుట్టు కుదుళ్ల నుంచి చివ‌ర్ల వ‌ర‌కు స్ప్రే చేసుకుని ష‌వ‌ర్ క్యాప్ పెట్టేసుకోవాలి.

రెండు గంట‌ల అనంత‌రం మైల్డ్ షాంపూతో హెడ్ బాత్ చేయాలి.ఇలా వారంలో ఒకే ఒక్క‌సారి చేశారంటే జుట్టు బ‌లంగా మారుతుంది.త‌ద్వారా జుట్టు ఊడ‌టం, చిట్ల‌డం, పొట్లిపోవ‌డం వంటి స‌మ‌స్య‌ల నుంచి విముక్తి ల‌భిస్తుంది.మ‌రియు ఈ హెయిర్ స్ప్రే ను వాడ‌టం వ‌ల్ల జుట్టు స్కిల్ అండ్ షైనీగా కూడా మెరుస్తుంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube