తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు కేవలం కొద్ది నెలలు మాత్రమే ఉండడంతో, అధికార పార్టీ బీఆర్ఎస్ అలెర్ట్అవుతోంది మూడోసారి పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే పట్టుదలతో ఉన్న సీఎం కేసీఆర్( CM KCR ) ఇక్కడ ఎన్నికల ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు వెళ్తున్నారు.బీఆర్ఎస్ జాతీయ రాజకీయాలకు రెఫరెండం కాబోతుండడంతో, ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
తెలంగాణలో మూడోసారి అధికారంలోకి వచ్చి తమ సత్తా చాటుకుని దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని చూస్తున్నారు.దీనిలో భాగంగానే ఎన్నికల సమర శెంకాన్ని పూరించారు.
జనాల్లో బీఆర్ఎస్( BRS party ) ప్రభుత్వం పై సంతృప్తి ఉందని, కచ్చితంగా మళ్ళీ తామే అధికారంలోకి వస్తామని ధీమాతో సీఎం కేసీఆర్ ఉన్నారు.ఇప్పటికే అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రకటిస్తున్నారు.
కొత్త కొత్త కంపెనీలను తెలంగాణకు తీసుకువచ్చి భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టే విధంగా చర్యలు తీసుకున్నారు.దీంతో పాటు జూన్ మొదటి వారం నుంచి జనాల్లోకి విస్తృతంగా వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

రాబోయే సార్వత్రిక ఎన్నికల టార్గెట్ గా పార్టీ కేడర్ లో ఉత్సాహం పెంచి వారిని ఎన్నికలకు సమాయత్వం చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు ఇప్పటికే పెండింగ్ లో ఉన్న సమీకృత కలెక్టరేట్ల ప్రారంభోత్సవాలు, అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం చేశారు .రాబోయే ఎన్నికల్లో వీటిని ప్రచార అస్త్రాలుగా ఉపయోగించుకునేందుకు డిసైడ్ అయిపోయారు.దీంతో పాటు జూన్ మొదటి వారం నుంచి వరుసగా జిల్లాల పర్యటనలు చేపట్టాలని కేసీఆర్, కేటీఆర్ లు నిర్ణయించుకున్నారు.ఈ మేరకు జూన్ 1న కామారెడ్డి, 2న సిరిసిల్ల పర్యటనకు కేటీఆర్ వెళ్లబోతున్నారు .అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రారంభత్సవాలు చేయబోతున్నారు.ఈ సందర్భంగా భారీగా సభలను నిర్వహించి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి,

ప్రతిపక్షాల విమర్శలను తిప్పుకొట్టి పార్టీ నాయకుల్లో ఉత్సాహం పెంచేందుకు కేటీఆర్ నిర్ణయించుకున్నారు.ఇక కెసిఆర్ జూన్ 4న నిర్మల్ జిల్లా కలెక్టరేట్ , 6 న నాగర్కర్నూల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం , 9న మంచిర్యాల ,12న గద్వాల జిల్లా సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించే విధంగా షెడ్యూల్ రూపొందించారు.అదేవిధంగా తెలంగాణ( Telangana )లోని ప్రతి జిల్లాకు కెసిఆర్, కేటీఆర్ వెళ్లి ప్రజల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆదరణ పెంచే విధంగా తమ పర్యటనలను ఉపయోగించుకోబోతున్నారు.
ఎక్కడికక్కడ భారీగా బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించి ప్రజల్లో బీఆర్ఎస్ పై ఆదరణ మరింత పెంచుకునే ప్రయత్నాలు కేసీఆర్, కేటీఆర్ లు చేస్తున్నారు.