సోనూసూద్ అనే పేరు ప్రస్తుతం తెలియని వారేలేరు.గత ఏడాది నుండి కరోనా సమయంలో దేవుడిలా వచ్చి ఆదుకున్న కలియుగ కర్ణుడు గా ప్రజల గుండెల్లో నిలిచాడు.
కరోనా సమయంలో బాధిత ప్రజలకు నేనున్నా అంటూ ధైర్యం నింపారు.ఆయన చేసిన సేవలకు ఏకంగా ఆయనకు గుడి నే కట్టించారు గ్రామస్తులు.
ఈయన సేవలకు రాజకీయ నాయకుల నుండి ఎన్ని విమర్శలు వచ్చినా వాటిని పట్టించుకోకుండా తన సేవలతో ముందుకు సాగుతున్నారు.
సినిమాల్లో విలన్ పాత్రలలో నటించిన సోనూసూద్.
నిజ జీవితంలో మాత్రం తను చేసిన సహాయానికి ఎవరు అందుకోని గుర్తింపు పొందాడు.కరోనా సమయంలో వలస కార్మికులను తమ సొంత ప్రాంతాలకు చేర్చి ఇక అప్పటినుండి తన సహాయాన్ని అలవాటు గా మార్చుకొని ప్రతి ఒక్కరికి సహాయం చేస్తున్నారు.
ఇప్పటికి ఎంతో మంది బాధితులను సోషల్ మీడియా ద్వారా ఆదుకున్నారు.

ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించాడు.కరోనా సోకిన బాధితులను క్వారంటైన్ లో ఉంచడానికి ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేశారు.ఎంతో మంది విద్యార్థులకు చదువుకునేందుకు తన వంతు సహాయాన్ని అందించాడు.
ఇక ఇదిలా ఉంటే సోషల్ మీడియా లో సోను అప్పుడప్పుడు సరదా కామెంట్స్ కూడా చేస్తుంటాడు.
ఇప్పటికే సోనూసూద్ పేరు మీద పలు షాపులు ఉన్నాయి.
ట్రైలర్, రీ ఛార్జ్, రెస్టారెంట్ లు ఇలా ఆయన పేరుతో షాపు లు ప్రారంభం కాగా.తాజాగా మరో రీ ఛార్జ్ షాపు ప్రారంభమైంది.
ఈ సందర్భంగా సోను సోషల్ మీడియాలో కామెంట్ చేస్తూ.నాకు వంద రూపాయలు రీఛార్జ్ దొరుకుతుందా? భాయ్ అని కామెంట్ చేశాడు.ప్రస్తుతం ఈ కామెంట్ వైరల్ గా మారింది.గతంలో కూడా తన పేరుమీద ఉన్న రీఛార్జ్ షాప్ కు నాకు ఫ్రీగా రీఛార్జ్ చేస్తావా అంటూ సెటైర్ వేసిన సంగతి తెలిసిందే.