సాధారణంగా చాలా మంది రాత్రుళ్లు నిద్ర పట్టక తెగ ఇబ్బంది పడుతుంటారు.పడుకుందామని ఎంత ప్రయత్నించినా నిద్ర రానే రాదు.
దాంతో ఉదయానికి మూడీగా, డల్‌గా, నీరసంగా మారి పోతుంటారు.చికాకు, కోపం తారా స్థాయిలో ఉంటాయి.
చిన్న చిన్న కారణాలకు సైతం ఓవర్‌గా రియాక్ట్ అవుతుంటారు.వీటిని అధిగమించేందుకు చేసేదేమి లేక కొందరు నిద్ర మాత్రలకు అలవాటు పడుతుంటారు.
కానీ, నిద్ర మాత్రలు ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి.రెగ్యులర్‌గా వీటిని వాడితే పలు అనారోగ్య సమస్యలను సైతం ఎదుర్కోవాల్సి వస్తుంది.
అందుకే రాత్రుళ్లు నిద్ర పట్టడానికి సహజ పద్ధతులనే ఎంచుకోవాలి.అయితే ఇప్పుడు చెప్పబోయే నాలుగు జాగ్రత్తలను తీసుకుంటే గనుక రాత్రుళ్లు హాయిగా నిద్రపోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం బాగా నిద్ర పట్టడానికి తీసుకోవాల్సిన ఆ నాలుగు జాగ్రత్తలు ఏంటో ఓ చూపు చూసేయండి.
వాకింగ్.
నిద్ర పట్టడానికి సూపర్‌గా సహాయపడుతుంది.నిద్ర పోవడానికి ముందు ఓ అర గంట నుంచి గంట పాటు వాకింగ్ చేస్తే శరీరం అలసి పోతుంది.
దాంతో మీరు బెడ్‌పైకి వెళ్లగానే నిద్రలోకి జారుకుంటారు.
రాత్రుళ్లు హాయిగా నిద్రపోవాలి అనుకుంటే.పడుకోవడానికి గంట ముందు నుంచీ ఫోన్, ల్యాప్ టాప్, టీవీ వంటి వాటిని పూర్తిగా ఎవైడ్ చేయాలి.అప్పుడే మీరు నాణ్యమైన నిద్రను పొందగలుగుతారు.
కొందరు హెవీగా భోజనం చేస్తే బాగా నిద్ర పడుతుందని భావిస్తుంటారు.కానీ, ఇందులో ఏ మాత్రం నిజం లేదు.నైట్ టైమ్ ఎంత లైట్‌గా ఫుడ్ తీసుకుంటే అంత బాగా నిద్ర పడుతుంది.
ఇక చాలా మందికి రాత్రి వేళ టీ, కాఫీలు తాగే అలవాటు ఉంటుంది.
ఈ అలవాటే మీ నిద్రను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.కాబట్టి, పొరపాటున కూడా నైట్ టైమ్ టీ, కాఫీలు తీసుకోవద్దు.