స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) కీలక సూత్రధారి అంటూ సిఐడి రిమాండ్ రిపోర్టులో సంచలన అభియోగాలు మోపింది.స్కిల్ స్కామ్ లో చంద్రబాబుకు పూర్తిగా అవగాహన ఉందని సిఐడి తెలియజేసింది.
చంద్రబాబు కనుసన్నల్లోనే డబ్బులు విడుదల అయ్యాయని అన్నది.ఈ అభియోగంతోనే ఏసిబి కోర్టులో శనివారం సాయంత్రం చంద్రబాబు నాయుడును ప్రవేశపెట్టారు పోలీసులు.
దీంతో ఆంధ్ర రాష్ట్రంలో టిడిపి ( TDP ) అభిమానులంతా ఒక్కసారిగా ఫైర్ అయ్యారు.ఎంతో మంది కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి అక్రమంగా అరెస్టు చేస్తున్నారని ధర్నాలు చేశారు.

అయినా పోలీసుల ప్రొటెక్షన్ తో చంద్రబాబు ను కోర్టులో హాజరు పరిచారు.శనివారం సాయంత్రం 5.10 నిమిషాల నుండి ఆదివారం ఉదయం 3 గంటల వరకు విచారణ సాగింది.చంద్రబాబును ఏకంగా 10 గంటల పాటు విచారించారు అధికారులు.
చంద్రబాబు అరెస్టుపై టిడిపి అగ్ర నాయకులు స్పందించారు.కావాలనే అక్రమ కేసులు పెట్టించి అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు.
ప్రజలు అన్ని గమనిస్తున్నారని తెలియజేస్తూ వస్తున్నారు.

అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ( Andrapradesh State ) లో చంద్రబాబు అరెస్టుతో రచ్చ రచ్చగా మారింది.ఇక టిడిపి కార్యకర్తలు అయితే కన్నీరు పెడుతున్నారు.అంతేకాకుండా చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక ఆరుగురు కార్యకర్తలు గుండెపోటుతో మరణించారు.
ఈ విధంగా విపరీతమైన సెంటిమెంట్ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబుకు పెరుగుతోంది.కట్ చేస్తే చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో జగన్ ( Jagan ) అక్రమాస్తుల కేసులో 16 నెలలపాటు జైల్లో ఉన్నారు.
ఇదే సమయంలో వైయస్ అభిమానులు జగన్ ను అక్రమంగా అరెస్టు చేయిస్తున్నారని అప్పట్లో నానా రచ్చ చేశారు.ఆ విధంగా జగన్ కు అరెస్టు ఒక సెంటిమెంటులా పనికి వచ్చిందని చెప్పవచ్చు.
ఆ సెంటిమెంట్ తోనే ఆయన ఎన్నికల్లో విజయం సాధించారు.ఇదే కోవలో చంద్రబాబు కూడా వెళ్తున్నారు.
ఆయన కూడా ఎన్నికల ముందే అరెస్టు కావడంతో జగన్ లాగే చంద్రబాబుకు కూడా ఈ సెంటిమెంట్ కలిసి వస్తుంది అంటూ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.