ఇతనే షారుఖ్ డూప్.... ఈయన రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

బాలీవుడ్ నటుడు షారఖ్ ఖాన్( Shahrukh Khan ) తాజాగా జవాన్ సినిమా( Jawan Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా అన్ని ప్రాంతాలలోనూ ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

 Do You Know Shahrukh Khan Dupe Remuneration Full Details Here, Shahrukh Khan,-TeluguStop.com

ఇక ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం అలాగే షారుఖ్ ఖాన్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ సినిమా అన్ని భాషలలోనూ ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాలో షారుక్ ఖాన్ డూప్ గా నటించిన వ్యక్తి గురించి పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

షారుఖ్ ఖాన్ కి డూప్ గా నటిస్తున్న వ్యక్తి పేరు ప్రశాంత్ వాల్డె( Prashanth vaalde ) .షారుఖ్ కి డూప్ అయినప్పటికీ రచయితగా, దర్శకుడిగా , నిర్మాతగా కూడా ప్రశాంత్ రాణిస్తున్నాడు. ఇలా ఈయన నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు అంటే ఈయన సంపాదన ఏ స్థాయిలో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు.తాజాగా ప్రశాంత మాట్లాడుతూ తాను షారుక్ ఖాన్ సినిమాలలో కదా 15 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నానని తెలిపారు.

ఇక జవాన్ సినిమాలో కూడా తాను కొన్ని కీలక సన్నివేశాలలో నటించానని ఈయన తెలియజేశారు.

ఈ విధంగా గత 15 సంవత్సరాలుగా షారుఖాన్ డూప్ గా నటిస్తున్నటువంటి ప్రశాంత్ ఏ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు అనే విషయానికి వస్తే ఒకరోజు షూటింగ్ లొకేషన్లో పాల్గొంటే దాదాపు 30 నుంచి 40 వేల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటారట ఇలా సినిమా పూర్తి అయ్యేసరికి దాదాపు కోటి రూపాయలకు పైగానే రెమ్యూనరేషన్ అందుకుంటారని సమాచారం.ఇలా షారుఖ్ ఖాన్ డూప్ గా ఉన్నటువంటి ఈయన భారీగానే ఆస్తులను సంపాదిస్తున్నారని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube